భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా : అన్నమయ్య సంకీర్తన

నల్లబల్లి చెన్నకేశవునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన – 1

శఠగోప యతీంద్రులకడ సకల వైష్ణవాగమములను అభ్యసించిన అన్నమయ్య జీవితమే ఒక ధీర్ఘశరణాగతి. కడప గడపలో జనియించిన ఈ వాగ్గేయకారుడు తన నుతులతో వేంకటపతిని కీర్తించి ఆనంద నృత్యం చేసినాడు.

నల్లబల్లి – కడప జిల్లా, ముద్దనూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ గల చెన్నకేశవ స్వామిని పలుమార్లు దర్శించి తరించిన అన్నమయ్య, ఆ స్వామిపై పలు సంకీర్తనలను రాసి – పాడినాడు.

చదవండి :  కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ - అన్నమయ్య సంకీర్తన


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

కీర్తన సంఖ్య-329                 రాగిరేకు – 566                 రాగం – దేవగాంధారి

భావమెరిగిన నల్లబల్లి చెన్నుడా
నావద్దనే వుండుమీ నల్లబల్లి చెన్నుడా ||పల్లవి||

వేసరక నీవు నాతో వేమారు జేసినట్టి
బాసలు నమ్మితి నల్లబల్లి చెన్నుడా
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను
నా సూటికే మన్నించు నల్లబల్లి చెన్నుడా ||భావమెరిగిన||

చదవండి :  అన్నమయ్య కథ : 4వ భాగం

క్రియ గూడ నేను నీ కేలువట్టి పెండ్లాడితి
బయలీదించకు నల్లబల్లి చెన్నుడా
ప్రియములు రెట్టింప బెనగితి నిందాకా
నయములు చూపుమీ నల్లబల్లి చెన్నుడా ||భావమెరిగిన||

యెనసితి విటు నన్ను నియ్యకోలు సేసుకొని
పనుపడె రతి నల్లబల్లి చెన్నుడా
ఘన శ్రీవేంకటాద్రిపై కందువ నేలుకొంటివి
నను నిందరిలోపల నల్లబల్లి చెన్నుడా ||భావమెరిగిన||


సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి…

చదవండి :  అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు రాసిన సంకీర్తన

ఇదీ చదవండి!

సింగారరాయుడ

కరుణించవయ్య యిఁక కడు జాణవౌదువు – అన్నమయ్య సంకీర్తన

ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: