ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కడప?

ఇది ఊహకు అందని విషయమనీ … మీరు నమ్మరనీ  మాకూ తెలుసు. మీరు ఈ విషయాన్ని నమ్మాలని మేము కోరుకోవడం లేదు. కాకపొతే అలోచించి చూడండి – మీకే తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణను ఊహలకు అందకుండా పార్లమెంటు సాక్షిగా ఆమోదించిన కాంగిరేసు పెద్దలు ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు చెప్పి వైకాపా మరియు తెదేపాలకు తలనొప్పి సృష్టించేందుకు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఈ మేరకు డిల్లీ పెద్దలు పెద్ద వ్యూహమే రూపొందించినట్లు నిఘా వర్గాల సమాచారం.

కాంగిరేసు అడుగులకు మడుగులొత్తి పార్లమెంటులో బిల్లు పెడితే అడ్డుకోవడం కోసమే రాజీనామా చేయటం లేదంటూ ఊదరగొట్టిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు కనీసం చెప్పుకోడానికి కూడా వీలు లేని విధంగా బిల్లును ఆమోదిమ్పజేసిన అధిష్టానం ఇప్పుడు రాజధాని పేరు చెప్పి వైకాపా, తెదేపాలకు చెక్ పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తోంది.

ఇప్పటికే కోస్తాంధ్రకు చెందిన నాయకులు రాజధానిని గుంటూరు – విజయవాడల మధ్యలో ఏర్పాటు చేస్తే అందరికీ అనువుగా ఉంటుందని ప్రచ్రాం చేస్తున్నారు. ఇందుకు కోస్తా వారి ఆధిపత్యంలో కొనసాగుతున్న టి.వి చానళ్ళు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. ఇక్కడ రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులను మీ అభిప్రాయం చెప్పమని అడగడం ద్వారా మూడు  ప్రాంతాలలోని (ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, సీమ) రెండు ప్రాంతాల ప్రజల ఆగ్రహానికి గురిచేసి (ఎందుకంటే మూడు ప్రాంతాల వారు రాజధానిని కోరుకుంటున్నారు) అక్కడ తమ వ్యూహం అమలు పరిచి వారిపై వ్యతిరేఖతను అనువుగా మార్చుకోవాలి అన్నది కాంగ్రెస్ పెద్దల ఆలోచన.

చదవండి :  ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

ఈ విషయం తెలిసీ వీరు ఎటూ తేల్చి చెప్పరు. ఎందుకంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ గేమ్ ప్లాన్ వీరికి బాగా గుర్తుండే ఉంటుంది. కాబట్టి జగన్ అయితే  కేంద్రమే నిపుణుల కమిటీ ద్వారా తేల్చాలనవచ్చు. చంద్రబాబైతే అందరినీ ఒప్పించి రాజధాని నిర్ణయించండి అంటారేమో! ఈయన ఆ మాట అనగానే కాంగ్రెస్ వాళ్ళు అంటారు – ‘అదెలాగో మీరే చెప్పండి’ అని.

ఇక అప్పుడు బాబు గారు మళ్ళీ కొబ్బరి చిప్ప, రెండు కండ్ల సిద్ధాంతాలు వల్లె వేస్తారేమో తెలీదు.  లేదంటే కోస్తా, ఉత్తరాంధ్ర మధ్యన పెట్టండి అని అడిగినా అడగవచ్చు. ఎందుకంటే సీమ నాలుగు జిల్లాలే – పైగా ఆర్ధికంగా బలహీనమైనవి. మిగతావి తొమ్మిది జిల్లాలు – పైగా అర్ధబలం కలిగిన వారంతా అక్కడే ఉన్నారు కదా – ఎన్నికలలో నెగ్గాలన్నా, ముఖ్యమంత్రిగిరీ వెలగబెట్టాలన్న వారి మద్దతు కీలకం.

చదవండి :  సొంత జిల్లాకు తరలించుకుపోతున్నా....

చంద్రబాబు ఇన్ని ఆప్షన్స్ ఇస్తుంటే జగన్ ఊరుకుంటాడా? జగన్ కూడా  కోస్తా, ఉత్తరాంధ్ర మధ్యన పెట్టండి అని అడిగినా అడగవచ్చు. పై కారణాలే ఇక్కడా వర్తిస్తాయి. వీళ్ళిద్దరికీ తోడుగా కిరణ్ కూడా చేరతారేమో ! ఎందుకంటే ఆయన రేపో మాపో పార్టీ పెడతారని మీడియా మిత్రులు తీర్మానిన్చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ గద్దలు కోస్తా ప్రాంతంలో అనువైన ప్రాంతాలుగా చెప్పబడుతున్న రెండు చోట్ల తమ రెక్కల చప్పుడు వినిపిస్తున్నాయి. ఈ గద్దలు కూడా ఆయా ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఇం’ధనం’ సమకూరుస్తారు. కాబట్టి వారి ప్రయోజనాలు కూడా వీరికి ముఖ్యమవుతాయి.

ఇప్పుడు ప్రజాగ్రహానికి భయపడి స్తబ్దుగా ఉన్న సీమాంధ్ర ఎంపీలను రాజధాని పేరు చెప్పి క్రియాశీలం చెయ్యవచ్చనేది కూడా కాంగ్రెస్ భావన.

చదవండి :  దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం ...

రాజకీయ నాయకులు ఇలా ఆప్షన్ల పేరు చెపితే సీమ వాసులు భగ్గుమంటారు – ఫలితంగా ప్రత్యెక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ బలపడవచ్చు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు రంగ ప్రవేశం చేస్తారు – సమస్యను పరిష్కరిస్తామంటూ…

తెలివిగా కడప లేదా తిరుపతిని రాజధానిగా ప్రకటిస్తారు – సీమ ప్రజల మీద అభిమానం నటిస్తూ … జగన్ , చంద్రబాబు, కిరణ్ లకు సొంతూల్లలో చెక్ పెట్టేట్లు. సీమలో  రాజధాని పేరు చెప్పి… ప్రసిద్ధ విద్యలయాలను, మంచి పరిశ్రమలను కోస్తాలో ఏర్పాటు చేస్తారు.

కడపలో అయితే ఇప్పటికే ఏపిఐసిసి సేకరించి పెట్టిన 5 వేల ఎకరాలు నగరానికి కూతవేటు దూరంలో సిద్ధంగా ఉంది.  నాకు తెలిసి మిగతా 12 జిల్లాలలో నగరానికి సమీపంలో అంత ప్రభుత్వ భూమి సిద్ధంగా లేదు – ఈ పాయింటు చాలు కాంగిరేసు లేదా భాజపా నడిపించబోయే నిపుణుల కమిటీకి…

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

ఒక వ్యాఖ్య

  1. శివరామప్రసాదు కప్పగంతు

    ఎందుకు మాష్టారూ మరొక 50 సంవత్సరాల ఉద్యమాలకు పునాది వెయ్యటం! పనిలో పని మిగిలిన ఈ మిగిలిన ఆంధ్ర ప్రదేశ్ ను రాయలసీమ, కళింగ ఆంధ్ర, కోస్తా ఆంధ్రాగా మూడు రాష్ట్రాలు చేసేస్తే ఇక మళ్ళీ మళ్ళీ ఈ వేర్పాటు వాదాలు రావు. ఇక వస్తే గిస్తే జిలాల వారిగా వేర్పాటు వాదాలు రావాలి! ఇప్పుడు తెలుగు మట్లాడుతున్న రాష్ట్రాలు రెండుగా చేశారు. కాని, నాలుగుగా చేసి ఉండాల్సింది. చేస్తూ, తెలంగాణాకు పూర్వపు నిజాం రాజ్యంలోని భాగాలు అన్నీ, ప్రస్తుతం మహారాష్ట్రలో, కర్నాటకలో ఉన్న ప్రాంతాలను కలిపి తెలంగాణా ఏర్పాటు చేసి ఉండాల్సింది. అటు చత్తీస్‌ఘడ్, ఒరిస్సా, ఇటు కర్నాటకా తమిళనాడుల్లో తెలుగు మాట్లాడే ప్రాంతాలను కళింగ ఆంధ్రలోనూ, రాయలసీమలోనూ కలిపి ఈ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చెస్తేనే భవిష్యత్తు తగాదాలు లేకుండా ఉంటుంది. లేదంటే మళ్ళీ సిగపట్లు తప్పవు, దానికి నాంది ఈ పాత/కొత్త రాష్ట్రానికి రాజధాని ఎక్కడ పెట్టాలి అన్న తగాదా. అవును తగాదానే! అది చర్చగా సాగటం కల్ల. హైదరాబాదు అనుభవంతో, రాజధాని ఎక్కడ పెట్టినా సరే మిగిలిన ప్రాంత ప్రజలు తమకు అన్యాయం జరిగిందనే భావిస్తారు. అందులో అనుమానం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: