cpi roundtable

విభజనోద్యమం తప్పదు

కడప: సీమహక్కులను కాలరాస్తే మరో విభజనోద్యమానికి నాందిపలుకుతాం… శ్రీశైలంలో 854 అడుగుల నీటినిల్వకై పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం సాగిస్తామంటూ పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు, మేధావులు, ప్రముఖులు ఉద్ఘాటించారు. స్ధానిక సీపీఐ పార్టీ కార్యాలయంలో గురువారం 107 జీవో ఉల్లంఘనపై అఖిలపక్ష, ప్రజాసంఘాల నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి నీలం సంజీవరెడ్డి రీసెర్చ్‌సెంటర్‌ పూర్వసంచాలకులు లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పాలకుల వివక్ష కారణంగా ఒకనాటి రతనాల రాయలసీమ నేడు రాళ్ళసీమగా మారడం దౌర్బాగ్యకరమన్నారు. ఏ ప్రాంత అభివృద్ధ్దికైనా తాగు, సాగునీరు ముఖ్యమని, ఇలాంటి ప్రాధాన్యం కలిగిన నీటివాటాను రాయలసీమకు అందించకుండా ఏడారిగా మారుస్తున్నారని ఆయన ఒకింత ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికే కృష్ణాపెన్నార్‌ ప్రాజెక్టును లేకుండా చేశారని, సిద్దేశ్వరం ప్రాజెక్టు గాలిలో కలిసిపోయిందని, గండికోట ప్రాజెక్టు ఊసేలేకుండా పోయిందని ఇలాంటి నేపథ్యంలో రాయలసీమను అంతోఇంతో ఆదుకుంటున్నా శ్రీశైల ప్రాజెక్టు నీటివాటాను కోల్పోతే రానున్న కాలంలో అత్యంత ప్రమాదకరమైన నీటిసమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన సూచించారు.

చదవండి :  రిమ్స్‌లో ఎంసీఐ తనిఖీలు

సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండే విధంగా రూపొందించిన 107 జీవోను తెలంగాణ సర్కార్‌ ఉల్లంఘిస్తూ రాయలసీమకు తాగు, సాగునీరు లేకుండా చేస్తోందని ఆయన మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు, నగరమేయర్‌ సురేష్‌బాబు మాట్లాడుతూ గతేడాది ఇదే సమయంలోనే సమైక్యాంధ్ర కోసం రాయలసీమవాసులు వీరోచితంగా ఉద్యమాలను సాగించి పోరుబాట సలిపారన్నారు. రాష్ట్రం విడిపోతే సీమకు తీరని అనాయ్యం జరుగుతుందని ఎలుగెత్తి చాటినప్పటికి సీమగోడును ఎవరూ వినిపించుకోలేదన్నారు. విభజన జరిగి 5 నెలలు కాకముందే రాయలసీమకు ప్రాణాధారమైన శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని అక్రమంగా తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతూ బరితెగింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ చర్యలను ఇటుసీమాంధ్రప్రభుత్వం, అటు కేంద్రప్రభుత్వం కళ్ళప్పగించి చూస్తున్నదే కాని సీమకు న్యాయం చేసేదిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.

చదవండి :  మార్చి 1 నుంచి 15 వరకు జిల్లాలో రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

కె.సి.కెనాల్‌ ఆయుకట్టు రైతుసంఘం నాయకుడు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉంచేలా కేంద్రప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

టీడీపీ రాష్ట్రసమన్వయ కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణాజలాల్లో రాయలసీమకు రావలసిన హక్కుపై సాగించే ఉద్యమాలకు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీమ ప్రయోజనాలను దెబ్బతీస్తే సహించేదిలేదని ఆయన హెచ్చరించారు.

ఏపీ అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, సీమాంధ్రప్రభుత్వాలు శ్రీశైలం ప్రాజెక్టు నీటిసమస్యను సామరస్యపూర్వకంగా పరిస్కరించి సీమ ప్రయోజనాలను కాపాడాలన్నారు. రాష్ట్రవిభజన రాయలసీమకు శాపంగా మారకుండా పాలకులు తగుచర్యలు తీసుకోవాలన్నారు.

చదవండి :  పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు

బీజేపీ నాయకుడు, రైతుసంఘం నేత సింగారెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీశైలంలో ప్రాజెక్టులో 854 అడుగుల నీటిమట్టంతో పాటు, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన నిధుల సాధనకు ఉద్యమించాలన్నారు.

కడప బార్‌ అసోిసియేషన్‌ అధ్యక్షుడు నాగరాజు, ప్రముఖ న్యాయవాది వీణాఅజయ్‌కుమార్‌, గుర్తింపుపొందిన ప్రైవేట్‌ విద్యాంస్ధల నాయకులు జోగిరామిరెడ్డి, రాయలసీమ రాష్ట్రసమితి రైతుసంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ ఎస్సీసెల్‌ నాయకులు శ్రీనివాసులు, సీపీఐ రైతుసంఘం నాయకుడు టి.రామసుబ్బారెడ్డి తదితరులు మాట్లాడుతూ శ్రీశైలం నీటి విషయంలో రాయలసీమకు అన్యాయం చేస్తే ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడరాదన్నారు. ప్రజలను, రైతులను, విద్యార్ధులను, కార్మికులను, మేథావులను, ప్రముఖులను చైతన్యపరిచి పోరుబాట సాగించాలన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాసంఘాలు, రైతుసంఘాల నాయకులు నాగసుబ్బారెడ్డి, క్రిష్ణమూర్తి, చంద్ర, కె.సి. బాదుల్లా, బషీరున్నీషా, డి.సి. వెంకటయ్య, లింగన్న, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

కడప జిల్లా వైకాపా లోక్‌సభ అభ్యర్థుల జాబితా – 2019

కడప: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ …

ఒక వ్యాఖ్య

  1. I have written so many comments on RAYALA SEEMA, regarding improvement and developments of RAYALA SEEMA, recently one small incident happen to KADAPA, I want remind you that before some days back unexpectedly, stopped the opening of KADAPA AIRPORT.So nobody does not know the reason why? what I come to understand is that Our CM is reason,simply because our CM did not want to open the airport with showing bogus excuses.I hope that our RAYALA SEEMA developments can be acheived by only, seperate State like Telangana.We should not keep our confidence in Chandra babu because he is the CHEIF MINISTER who belong to SEEMA DISTRICTS. But he is not CM for RAYALA SEEMA.Before he was CM to HYDERABAD now he is to Kosta. Now this is the time,we have to rise and wake from sleep to fight for our own State, So call it THE STATE OF RAYALA SEEMA. JAI HIND.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: