వైఎస్ స్వతంత్రుడు… అందుకే దాడి! – ఎ.బి.కె ప్రసాద్

పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతికాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం. వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ బేసిన్ సంపద దోపిడీకి సంబంధించి కేంద్రంతో, అంబానీలతో నాలుగేళ్లపాటు నిరంతరం సాగించిన పోరు వైఎస్ విశిష్ట వ్యక్తిత్వాన్ని తిరుగులేని విధంగా నిరూపించింది!

అమెరికా సామ్రాజ్యవాద పాలనా వ్యవస్థకు కాపలా దారులుగా జీవితాంతం ఊడిగం చేసిన మాజీ విదే శాంగ మంత్రి జాన్ ఫాస్టర్ డల్లెస్, మాజీ అధ్యక్షుడు కెన్నెడీ ‘‘ఒక దేశాన్ని జయించాలంటే రెండు మార్గాలు న్నాయని’’ చెబుతూ వీటిలో ఒకటి- ‘‘ఆ దేశపు ప్రజలపైన సైనికశక్తి ద్వారా ఆధిపత్యం సాధిం చడం’’, రెండోది ‘‘ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను డబ్బుల ద్వారా లోబరచుకోవడం’’ అని నిర్వచించిపోయారు. ఈ ‘బ్రహ్మసూత్రం’పైన ఆధారపడే అమెరికా పాల కులు రెండవ ప్రపంచ యుద్ధానంతరం (1946-47) ‘బ్రెటన్‌ఉడ్స్‌‘ సమావే శంలో మూడు సంస్థల ద్వారా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసి శాసించాలని వ్యూహం పన్నారు. ఆ మూడు సంస్థలే – ఒకటి ప్రపంచ బ్యాంకు, రెండు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఈఎంఎఫ్), మూడు ‘గాట్’ (తర్వాత ఇదే ప్రపంచ వాణిజ్య సంస్థగా – డబ్ల్యూటీఓగా మారింది).

అమెరికా సామ్రాజ్యవాద పెట్టుబడి వ్యవస్థ ఈ మూడింటిపై ఆధి పత్యాన్ని నిలబెట్టుకొని కొనసాగించుకోడానికి వాణిజ్య యుద్ధాలకు, స్థానిక యుద్ధాలకు, సాయుధ సంఘర్షణలకు తెరలేపింది. అంతేగాదు, ‘‘ది స్కూల్ ఆఫ్ అమెరికా’’ పేరిట జార్జియా రాష్ట్రంలో ఫోర్ట్ బెనింగ్ వద్ద ఒక దుండగీడుల శిక్షణా సంస్థను నెల కొల్పింది! అక్కడ హంతకులకు కూడా శిక్షణ ఇస్తారు. ఈ స్కూలును ‘హంత కుల పాఠశాల, చిత్రహింసల పరిషత్తు’’ (‘‘స్కూల్ ఆఫ్ ఎసాసిన్స్ అండ్ అకా డమీ ఆఫ్ టార్చర్’’) అని వ్యవహరిస్తారు!

అలాంటి వ్యవస్థకు జీతభత్యాలపై సేవలందించడ్డానికి కొందరు బడా గుమాస్తాలుంటారు. వీళ్లు వివిధ దేశాలలోని రాష్ట్రాల రాజధానీ నగరాల్లో పని చేసే కాన్సల్ జనరల్స్‌గా ఉంటారు! హైదరాబాద్‌లో కూడా సాంకేతిక సమా చార వ్యవస్థ పేరిట చౌకరేట్లపైన విద్యాధికులయిన మన యువత చేత ‘బాడుగ పనులు’ (ఔట్ సోర్సింగ్, ప్రోగ్రామింగ్) చేయించుకునే చాకిరీ వ్యవస్థలో భాగంగా ఇటీవల ఒక కాన్సులేట్ వెలిసింది. విద్యాధికుల వలసల్ని ప్రోత్సహి స్తోంది. ఈ కాన్సులేట్ ఏర్పడకముందు చెన్నైలో ఉండే అమెరికన్ కాన్సల్ జనరలే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలపైన కూడా ‘కూపీ’లు లాగే పనిలో ఉండటం రివాజుగా ఉండేది.

అయితే తాజాగా ఈ ‘కూపీ’లో భాగంగా చెన్నై కాన్సల్ జన రల్ 2007లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తలదూర్చి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతి రేకంగా కొందరు స్థానిక రాజకీయ వేగులతో మంతనాలాడి, వైఎస్ ప్రత్యర్థుల సాయంతో పంపిన ఒక నివేదికలోని అంశాలను ‘‘వికీలీక్స్’’ (15.9.2011) బయటపెట్టింది. కానీ ఇదే చెన్నై కాన్సల్ జనరల్ ఏనాడూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇలాంటి నివేదికను పంపిన దాఖలాలేదు. అందుకు బలమైన కారణాలున్నాయి! ఎందుకంటే, అమెరికా వేగుల వాళ్లుగాని, కాన్సల్ జనరల్స్‌గానీ, అమెరికా మెరమెచ్చుల కోసం ఎదురు తెన్నులు చూసే పాలకుల గురించి లేదా అమెరికా విధానాలకు, ఆ విధానాలలో భాగంగా వరల్డ్ బ్యాంకు, తదితర అనుబంధసంస్థలు ప్రవేశపెట్టిన ప్రజావ్యతి రేక ‘సంస్కరణ’లకు గొర్రెదాటు పద్ధతిలో తలలూపే పాలకుల గురించిగానీ ఎన్నడూ వ్యతిరేక నివేదికలు పంపరు! ఎటు తిరిగీ ఆ ‘సంస్కరణల’ లోతు పాతుల్ని అంతో ఇంతో అర్థం చేసుకుని ప్రజల మౌలిక ప్రయోజనాల్ని దెబ్బ తీసే అంశాలను స్వతంత్ర శక్తితో తోసిపుచ్చగల పాలకులను అమెరికా, దాని కాన్సల్ జనరల్స్ కనిపెట్టి మరీ నివేదికలు పంపడం ఒక ఆనవాయితీ.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

ఎందుకంటే, వైఎస్ పాలనలో కాన్సల్ జనరల్ చూడగలిగిన ‘అపారమైన అవి నీతి’ని చంద్రబాబు పాలనలో చూడలేకపోయింది! అవినీతికి ‘స్వ’-‘పర’ భేదాలుండవు! ఈ చూడలేకపోవడానికి కారణాలు పరిశీలించే ముందు కాన్సల్ జనరల్ నివేదికలో ‘కామెర్ల’ రోగి తరహాలో చొచ్చుకువచ్చిన పరిశీలన ఏమిటో చూద్దాం. ఇండియాలో ఎక్కడా లేని స్థాయిలో అవినీతి వైఎస్ పాలనలోనే ఉంద’ని ‘కొందరు’ ఆయనకు చెప్పారట!

సామాన్య ప్రజలకు సాంఘిక సంక్షేమ పథకాల పేరుతో దేశం అనుమతిం చగల అవినీతిస్థాయిని కూడా మించి వైఎస్ పాలన అవినీతికి ఒడి గట్టింద’ని ఒక ‘తటస్థుడు’ చెప్పాడట.

సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో అవినీతి జరిగిందని ‘మరి కొందరు’ చెప్పారట.

హైదరాబాద్‌కు వేర్వేరు సందర్భాల్లో వెళ్లినప్పుడు ఈ ‘అవినీతి’ గురించి పలువురు తటస్థ పరిశీలకుల నుంచి ఆయన విన్నాడట!

ఇరిగేషన్ ప్రాజెక్టులలో అవినీతికి ఎక్కువ అవకాశం ఉందని ఒక ‘ఆర్థిక వేత్త’ తనకు తెలిపాడట!

ఇలా కాన్సల్ జనరల్ ‘కొందరు’ పేరిట కాసేపు, మరికొందరని మరొక చోట, ‘తటస్థ’ పరిశీలకులని ఇంకోచోట, ఒక ‘ఆర్థికవేత్త’ అని వేరేచోట పేర్కొం టూ ఆ నివేదికను పంపాడు. అంతేగాని, అతడు తానుగా ఆ ప్రాజెక్టుల వద్దకు వెళ్లలేదు. వెళ్లి చూడలేదు. అసలెన్ని ప్రాజెక్టులకు వైఎస్ రూపకల్పన చేయిం చాడు, ఎన్నింటిని పూర్తి చేశాడు, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, మరెన్ని పూర్తి కావలసి ఉంది అన్న లెక్కతో అతనికి నిమిత్తం లేదు. పైగా ‘అవినీతి’కి శాతాలు కట్టి దేశ ప్రజలు ‘అనుమతించగల మేరకు’ ‘‘సుమారు 7 శాతం వరకు అవినీతిని అనుమతిస్తార’’ని తన అంచనాను ప్రజలనెత్తిన రుద్దేసి ఆ పైన అనుమతించరని తీర్పు చెప్పాడు’’! అలాంటి తప్పుడు శాతాలు కట్టడం పెట్టుబడిదారీ వ్యవస్థకూ, దాని కాపలాదార్లకూ కూసు విద్య! అయినా, ఇంతకూ చెన్నైలోని అమెరికన్ కాన్సల్ జనరల్ వైఎస్ సంక్షేమ పథకాలపైన, తలపెట్టి ప్రారంభించిన సాగునీటి పథకాలపైన అలాంటి ప్రతికూల నివేదికను పంపడానికి కారణం ఏమై ఉంటుంది?!

కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది! చంద్రబాబు హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో, ఎన్నింటిలోనో తాము ‘‘అడుగడుగునా ఒకే వ్యక్తితో మంతనాలు సాగించవలసివస్తోందనీ, ఇలాంటి అనుభవం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ తమకు ఎదురు కాలేదనీ, ప్రతీ స్కీములోనూ ‘దేశం’ మంత్రులకు చేతులు తడపవలసి వస్తోందనీ, ఏ రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి కేంద్రంగా ఇంత లంపటాన్ని చవిచూడలేదనీ ప్రపంచ బ్యాంకుకు అనుబంధంగా పనిచేసే డీఎఫ్‌ఐడీ (ప్రొఫెసర్ మానర్ రిపోర్టు) సంస్థ ప్రత్యేక సర్వే ద్వారా ఒక నివేదిక (2001-2002)లో తెలిపింది! అయినా అది కాన్సల్ జనరల్ గణనలోకి రాలేదు! ఎందుకని? 1991లో ప్రపంచ వ్యాంకు ‘ప్రజావ్యతిరేక సంస్కరణల’ను బేషరతుగా కేంద్ర పాలకులు ఆమోదించిన తరువాత అది అమలులోకి వచ్చిన దరిమిలా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్సాహంతో ఉరకలు వేసి ఎదురేగి హారతిపట్టి ఆ సంస్కరణలను ఆమోదించిన ముఖ్యమంత్రి అప్పటికి ఒక్క చంద్రబాబు మాత్రమే!

ఢిల్లీకి వచ్చిన వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు ఉల్ఫోన్సన్‌తో రాష్ట్ర ప్రభుత్వంలోని ఏ ఉన్నతాధికారి తోడూ లేకుండా ముఖాముఖి రహస్య మంతనాలాడింది చంద్రబాబు ఒక్కడే! అక్కడి నుంచి ‘నల్లేరు మీద బండి’లా రాష్ట్రంలో అడ్డూ అదుపూ లేకుండా యథేచ్ఛగా అన్ని రంగాలను బ్యాంకు ‘సంస్కరణల’తో కలుషితం చేసి భారీ ఎత్తున రుణాల ఊబిలోకి బాబు దించినందుకు బ్యాంకు సంతోషించింది. బ్యాంకు ఆదేశించినట్టుగా, నిర్దేశించినట్టుగా సంస్కరణలను శరవేగంతో అమలులో పెట్టింది బాబు!

వ్యవసాయ, పారిశ్రామిక రంగాలను ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు అస్తవ్యస్తం చేయడం ద్వారా తన మీద మరింతగా ఆధారపడేటట్లుగా బాబును మలిచింది వరల్డ్ బ్యాంకు. ఏడాదికి సుమారు 2 శాతం చొప్పున ప్రభుత్వోద్యోగులను పని నుండి తొలగించమన్న బ్యాంక్ ఆదేశాన్ని ‘మంచి బాలుడు’లా పాటించి అమలులో పెట్టింది బాబు! ‘సంస్కరణల’ మైకంలో కూరుకుపోయి సహకార రంగం సహా సుమారు పాతిక పరిశ్రమలను మూతపెట్టించింది బాబు. వ్యవసాయ రంగానికి బ్యాంకు ఆదేశించినట్టుగా సబ్సిడీలు కోతపెట్టి, రైతాంగానికి పంట కాలాల్లో విలువైన సలహాలు అందించే వ్యవసాయ విస్తరణాధికారుల వ్యవస్థను కునారిల్లచేసి, 1,500 మందికి పైగా రైతుల ఆత్మహత్యలకు దారులు చూపింది బాబు. నూతన సమాచార సాంకేతిక వ్యవస్థ పేరు చాటున అమెరికన్ ‘డాట్ కామ్స్’ మోజులో పడి ఆనుపానులు తెలియకుండా ప్రైవేట్ వ్యక్తులను ప్రోత్సహించి చివరకు ఆ ‘డాట్ కామ్స్’ డౌట్ కామ్స్‌గా మారి ఆకస్మికంగా మూతపడి వేలాది మంది ఉపాధి ధ్వంసం కావడానికి కారకుడయింది బాబు.

చదవండి :  రాయలసీమ సిపిఐ నాయకులు పోరాడాల్సింది ఎవరి మీద?

రాష్ట్ర విద్యారంగాన్ని బ్యాంకు ‘సంస్కరణల’లో భాగంగా ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి ప్రైవేట్ రంగంలో దశాగతి, దిశాగతీ లేని విద్యా సంస్థలు తామరతంపరగా తలెత్తడానికి, విద్యా వ్యాపారీకరణకు పూర్తి స్థాయిలో గేట్లు తెరిచింది బాబు. బ్యాంకు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రమేయాన్ని నామమాత్రం చేసి ప్రభుత్వ పాత్రను ‘బ్రోకరేజి’ స్థాయికి దిగజార్చింది బాబు. ఇక విద్యుత్ రంగ ‘సంస్కరణల’ంటారా! రాష్ట్రంలో ఉన్న విద్యుత్ రంగసంస్థల ఆస్తుల్ని లెక్కగట్టి ‘ఇది మంచి చౌక బేరమను’కుని, ఆ రంగాన్ని ప్రైవేటీకరించడం ద్వారా వేల కోట్ల రూపాయలకు పడగలెత్తవచ్చునని, రాష్ట్రానికి ఇచ్చిన రుణాలు తీరుమానం కాని పక్షంలో ఈ ఆస్తుల్ని తాము ఎలా కుదువబెట్టుకోవాలో ఆలోచించిన వరల్డ్ బ్యాంకు వ్యూహానికి తోడు నీడైంది బాబు.

విద్యుత్ పంపిణీ వ్యవస్థను ‘డిస్కమ్స్’ రూపంలో ప్రైవేటీకరించి, వినియోగదార్లపై అనూహ్య మైన భారం పెరగడానికి కారకుడయింది బాబు. బ్యాంకు ఫర్మానాల ప్రకారం ఆహార పంటలు పండించే రైతులను ‘డాలర్ల పంట’ కోసం వాణిజ్య పంటల వైపు మళ్లండని ప్రబోధించి వ్యవసాయమే దండగ అని ప్రగల్భించింది బాబు. ఇందుకు అనుగుణంగానే బ్యాంకు ఆదేశాల మేరకు చేపల, రొయ్యల పెంపకా నికి (ఆక్వాకల్చర్) రైతాంగాన్ని దారిమళ్లించి, ఆదాయవనరులు పెరుగుతా యన్న పేరిట లొట్టలు వేయించి ఆహార పంట భూముల్ని ఉప్పు నీటి ‘సరస్సులు’గా మార్చి, ఉన్న మంచినీటి క్షేత్రాలను కాస్తా ఉప్పురికించి, నాలుగేళ్ల అనుభవం తర్వాత ‘అలో లక్ష్మణా’ అనే స్థితికి రైతాంగాన్ని నెట్టింది బాబు. కనీసం 15 ఏళ్ల పాటు చేపల చెరువులకు ఎరపెట్టిన భూములు వరి సేద్యానికి పనికిరావన్న శాస్త్రవేత్తల సలహాను పక్కన పెట్టింది బాబు.

నిజాం చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగం నుంచి తప్పించి ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి కారకుడు బాబు. సింగరేణి కాలరీస్‌ను ప్రైవేట్ కంపెనీల పరం చేయడానికి ఆలోచనలు చేసి పావులు కదిపింది బాబు. ఆస్పత్రులలో వినియోగ రుసుం (యూజర్ చార్జీలు) బ్యాంకు హుకుంపైన ప్రవేశపెట్టి నిరసన పరంపరకు దారితీసింది బాబు. చివరికి ఆర్టీసీని బ్యాంకు ఆదేశాలపై ప్రైవేటీకరించడానికి గజ్జెకట్టింది బాబు. ‘ఆల్విన్’ సంస్థను మూలకు నెట్టినవాడు బాబు! హైదరాబాద్‌లో అమెరికా ఎఫ్‌బీఐ (నేరపరిశోధక శాఖ) శాఖ ఏర్పడడానికీ బాబు ఉదాసీనతే కారణమయింది. అమెరికా అధ్యక్షుడు క్లింటన్ హైదరాబాద్ రాక సందర్భంగా కార్యరంగాన్ని మొత్తం అమెరికన్ గూఢచార శాఖకు, అమెరికన్ సెక్యూరిటీ సిబ్బందికే అప్పగించి, సమర్థమైన స్థానిక పోలీసు ఉన్నతాధికార వ్యవస్థకే తలవంపులు తెచ్చింది కూడా బాబే. ‘ఏపీ ఆగ్రోస్’ ప్రభుత్వ సంస్థను మూయించిందీ బాబే. ‘రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ’ని మూసివేయించిందీ బాబే. ఈ కంపెనీ మూతబడిన గాథ వెనుక మరో ఉపగాథ ఉంది. కంపెనీ పేరు పొడి అక్షరాల్లో చెప్పాల్సి వస్తే ‘ఆర్‌ఎఫ్‌సీ’ అంటారు. ఆ పొడి అక్షరాల కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంది! సరిగా ఆ అక్షరాలనే విడమర్చి విస్తరిస్తే ఒక ఫిల్ముసిటీ పేరొస్తుంది! అయితే ఆ ఫిల్ముసిటీ పేరుకు రిపబ్లికన్ ఫోర్జ్ కంపెనీ (ఆర్‌ఎఫ్‌సీ) పొడి అక్షరాలు అడ్డొస్తాయి కాబట్టి అసలా కంపెనీ ఉనికికే ఎసరు పెట్టారు! ఇన్ని పనుల్ని కిక్కురుమనకుండా అమెరికా అండదండలతో నడుస్తున్న ప్రపంచ బ్యాంకుకు అనుకూలంగా తలొంచుకొని చేయబట్టే చంద్రబాబు మీద అమెరికాగాని, బ్యాంకుగాని ‘ఈగ’నైనా వాలనివ్వలేదు, వాలనివ్వరు కూడా!

చదవండి :  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

ఇలా రాష్ట్రాన్ని భారీ రుణాలతో ముంచెత్తి రాష్ట్ర ప్రజలలో తల ఒక్కింటికీ ఈ రుణ భారాన్ని ఆనాటి విలువలో రూ.10,000 చొప్పున మోపి పంచి పెట్టిన రుణ సంచితం నుంచి మొదలుకొని, వివిధ రంగాలలో వేగవంతం చేసిన ప్రైవేటీకరణ వరకూ డాక్టర్ వైఎస్ పాలనకు సంక్రమించినవి – అప్పులూ, తిప్పలూ, సమస్యల తుప్పలే గాని మరొకటి కాదు. అయినా గుండె కలవాడే దండిగా వ్యవహరించగలడు. 1,500 కిలో మీటర్ల పాదయాత్ర చేసి గడించిన అపూర్వ అనుభవంతో భావస్ఫూర్తిలోనే గాక ఆచరణలో కూడా ఎదిగిన వైఎస్ రైతాంగ సమస్యల్ని, పేద, సన్నకారు రైతుల ఇబ్బందుల్ని అర్థం చేసుకోగలి గాడు. ఆ తరువాతనే ‘జలయజ్ఞం’ ద్వారా తలపెట్టిన 17 ప్రాజెక్టులలో ఆరేడు ప్రాజెక్టులను అక్షరాల పూర్తి చేయగలిగాడు. అధికారానికి వస్తూనే రూ.1,500 కోట్ల మేర రైతాంగం నెత్తిపైన పేరుకుపోయిన విద్యుత్ బకాయీలను రద్దు చేశాడు. ఉచిత విద్యుత్‌ను మాట తప్పకుండా తన చివరి శ్వాస వరకూ అందించాడు. కేజీ 2 రూపాయలకే బియ్యాన్ని పేదసాదలకు అందుబాటులో ఉంచాడు.

‘పావలా వడ్డీ’ పథకం ద్వారా డ్వాక్రా మహిళల సంక్షేమానికి చేదోడు వాదోడయ్యాడు. బాబు పాలనకు భిన్నంగా, ప్రపంచ బ్యాంకు విధానాలకు, ఒత్తిళ్లకూ వ్యతిరేకంగా నిలిచి సింగరేణి, ఆర్టీసీల ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకొని, లాభాల బాట పట్టించాడు. బాబు నష్టాలలోకి నెట్టిన ‘ఏపీ ఆగ్రోస్’ సంస్థను పునరుద్ధరించి లాభాల్లోకి నడిపించడమే గాక, ఏడాది తిరిగేసరికి సిబ్బందికి బోనస్ ఇప్పించిన ఘనత వైఎస్‌ది! పోలవరం, పులిచింతల ప్రాజెక్టులకు, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకాలకు (పెక్కు తెలంగాణ జిల్లా భూములు సముద్రమట్టానికి 700 నుంచి 1200 అడుగుల ఎత్తున ఉండడం వల్ల) రూపకల్పన చేసి, ఆచరణలో పనులు చేపట్టాడు. జూరాల హైడెల్, రాయలసీమ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను ఆచరణ సాధ్యం చేశాడు.

ఉన్న అవకాశాలలోనే తొలిసారిగా పేద వర్గాల బిడ్డలకు ఉన్నత విద్యావకాశాలను కల్పించాలన్న సంకల్పంతో పెక్కు విశ్వవిద్యాలయాల స్థాపనకు తపనతో అంకురార్పణ చేశాడు. పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చాడు. అన్నింటికన్నా మిన్నగా, వృద్ధాప్య పెన్షన్లను ఏ పాలనలో కన్నా హెచ్చుగా పెంచి క్రమం తప్పకుండా ఆచరిం చాడు. ఇతర రంగాలతోపాటు వైద్య చికిత్సలు కూడా వ్యాపారీకరణకు లోను అయిన దశలో పేద కుటుంబాల కోసం ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా లక్షలాది మందికి ఆరోగ్యదానం చేవాడు. ఆచరణలో తమ అనుభవంలోకి వచ్చిన ఈ పథకాలు వైఎస్ హఠాన్మరణంతో ఎక్కడ ఆగిపోతాయోనన్న బెంగతో సుమారు 500 మంది సామాన్యులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

రాష్ట్రంలో తమను ఆదుకునే ప్రభుత్వం ఉందన్న విశ్వాసాన్నీ, ధీమాను బలంగా ప్రజాబాహు ళ్యంలో వైఎస్ కలిగించాడు. కనుకనే అంతమంది ఆత్మహత్యలు! దేశ చరిత్రలో భారత రాష్ట్రాలలో ఏ ముఖ్యమంత్రి చనిపోయినా, ఏ రాష్ట్రంలోనూ ప్రజలు అంతటి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించినంత వెలితిని అనుభవించిన దాఖలాలు లేవు! అనేక అవాంతరాల మధ్య, సమస్యల మధ్య, అధికార పక్షంలోని కుమ్ములాటల మధ్య, తలాతోకా లేని చీలుబాటలు పట్టిన ఉద్యమాల తాకిడి మధ్య పరిస్థితులు అనుకూలించిన పరిధిలోనే అనతి కాలంలో ఇన్ని మంచి పరిణామాలకు వైఎస్ సొంత చొరవతో దోహదం చేసినందువల్లే అమెరికన్ కాన్సల్ జనరల్ అక్కసుతో ఏకపక్ష ప్రతికూల నివేదికను పంపడానికి కారణమై ఉండాలి! ఇది పూర్తిగా దేశ, రాష్ట్ర ఆంతరంగిక వ్యవహారాల్లో పరాయిశక్తి జోక్యంగా భావించి, నిరసించాల్సిన పరిణామం.

వ్యక్తిత్వాన్ని కోల్పోయి, పరదేశానికీ, పరదేశీకీ ‘జో హుకుం’ అనే పరాధీన పాలకులకీ, మడమ తిప్పకుండా తమ రాజకీయ వ్యక్తిత్వ విభవాన్ని ఇనుమడింపచేసుకునే ‘స్వాధీన’ పరిపాలకులకీ మధ్యన తేడా ఇదే! కేజీ బేసిన్ సంపద దోపిడీకి సంబంధించి కేంద్రంతో, అంబానీలతో నాలుగేళ్లపాటు నిరంతరం సాగించిన పోరు వైఎస్ విశిష్ట వ్యక్తిత్వాన్ని తిరుగులేని విధంగా నిరూపించింది!

ఇదీ చదవండి!

rayalaseema sangati

12న అమెరికాలో రాయలసీమ వనభోజనాలు

జార్జియాలోని కమ్మింగ్ నగరంలో… నోరూరించే రాయలసీమ వంటకాలతో మెనూ.. (అమెరికా నుండి నరేష్ గువ్వా) జులై 12న ఆదివారం నాడు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: