babugandikota
గండికోట వద్ద బహిరంగ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

35 టీఎంసీల నీరు తీసుకవస్తా : బాబు

కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ పరంగా రావాల్సిన పరిహారం తప్పకుండా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

చదవండి :  బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

గండికోట, మైలవరంలో 35 టీఎంసీల నీరు నిల్వ చేసి సర్వారాయసాగర్ వరకూ నీరు ఇస్తామని, కడప జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని తెలిపారు. భూగర్భజలాలు అడుగంటి 1200 నుంచి 1600 అడుగుల లోతుకు బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. భూగర్భజలాలను పెంపొందించే ప్రక్రియను ఎవరికి వారు వేగవంతం చేయాలన్నారు.

తమ్ముళ్లూ మీరు ఒక్కసీటే గెలిపించారు.  అయినా కూడ వెనుకుబాటు తనం రూపుమాపేందుకు కృషి చేస్తాను. ఇప్పటికే స్టీల్ ప్లాంట్, టెక్స్‌టైల్ ఫార్కు ప్రకటించాను.. అవన్నీ చేసి తీరుతానని సీఎం పునరుద్ఘాటించారు. ఒంటిమిట్ట కోదండ రామునికి పట్టువస్త్రలు సమర్పించనున్నాం, టూరిజం సర్క్యూట్‌లో చేర్చి మరింత అభివృద్ధి చేస్తామని ఆయన వివరించారు.

చదవండి :  ఈ పొద్దు మాయిటాల జమ్మలమడుగుకు బాబు

ఎట్టిపరిస్థితుల్లో గండికోటకు నీరు ఇచ్చి తీరుతామని భారీ నీటి పారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. నిర్వాసితులకు అన్యాయం చేయమని స్పష్టం చేశారు. దగా పడిన రైతులందరికీ ప్రమోజనం చేస్తున్న ముఖ్యమంత్రికి పాదాభివందనమని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ ఎస్‌వి.సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సి ఎం.రమేష్‌నాయుడు, జిల్లా టిడిపి అధ్యక్షుడు ఎం.లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, విజయమ్మ, ఆర్.శ్రీనివాసులరెడ్డి (వాసు), మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పుత్తా నరసింహారెడ్డి, ఎన్‌డి.విజయజ్యోతి, పుట్టా సుధాకర్‌యాదవ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

చదవండి :  మర్నాడు ఇడుపులపాయలో వైకాపా శాసనసభాపక్షం సమావేశం

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: