ప్రసిద్ధులు

రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక…

జానమద్ది విగ్రహానికి

డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన తగిన వారనడంలో కొంచెమైనా అతిశయోక్తి లేదు. వేమనను సీపీ బ్రౌన్ వెలుగులోకి తెస్తే, సీపీ బ్రౌన్‌ను జానమద్ది వెలుగులోకి తెచ్చారు. కడపలోని తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా వచ్చిన బ్రౌన్ తెలుగు …

పూర్తి వివరాలు

‘అదే నా అభిమతం’ – గడికోట పవన్‌కుమార్‌రెడ్డి, IFS విజేత

Gadikota Pavan Kumar Reddy

‘‘జీవితమంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు.. చుట్టూ ఉన్న నిస్సహాయుల్లో కొందరికైనా సాయపడినప్పుడే జీవితానికి సార్థకత లభిస్తుంది..’’ అంటూ తరచూ నాన్న చెప్పే మాటలే అతడి ఆచరణకు మార్గదర్శకాలయ్యాయి. ఇప్పుడు ఆ ఆశయ సాధనకు మార్గం సుగమం చేసే ఆలిండియా సర్వీసుకు ఎంపికయ్యాడు వైఎస్సార్ (కడప) జిల్లా యువకుడు గడికోట పవన్‌కుమార్‌రెడ్డి. …

పూర్తి వివరాలు

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

రంగస్థల నటులు

చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక …

పూర్తి వివరాలు

పదిమంది నాయకులకంటె పది అడుగుల ఎత్తున …

వైఎస్ హయాంలో

నా అరవయ్యో యేట రాజకీయాలనుంచి వైదొలగుతాను- అన్నారు రాజశేఖరరెడ్డి ఆ మధ్య. ఈ మధ్య ఎవరో ఆ ప్రస్థావన తెస్తే “ఒకటి రెండు పనులు చక్కబెట్టి ఆ పని చేస్తాను” అన్నారు. కాని మృత్యువుకి ముందువెనుకలు నిర్దుష్టంగా తెలుసు. మృత్యువు కొన్ని జీవితాలకు అమోఘమైన డిగ్నిటీని యిస్తుంది. అనూహ్యమైన గ్లామర్ ని యిస్తుంది. …

పూర్తి వివరాలు

ఆరవేటి శ్రీనివాసులు – కళాకారుడు

ఆరవేటి శ్రీనివాసులు

నాటికలు నాటకాలు రాసి ఒప్పించాడు – నటించి మెప్పించాడు – ప్రయోక్తగా రాణించాడు – పాటను పరవళ్ళు తోక్కించాడు – మిమిక్రీతో అలరించాడు – కథలతో ఆలోచింపజేశాడు. కథ చెప్పి ఎదుటివాళ్ళను మెప్పించడంలో గొల్లపూడి మారుతీరావు అందెవేసిన చేయి అని విన్నాను. అనుభవానికి రాలేదు. అయితే ఆ అద్భుత ప్రయోగాల్లో ఆరవేటి తనకు తానే సాటి.

పూర్తి వివరాలు

‘గడ్డం పొడవునుబట్టా, తెల్లబడిన వెంట్రుకను బట్టా’ – సభాపతీయం 1

బండారు రత్నసభాపతి

రత్న సభాపతిని ఆంధ్రప్రదేశ్ సహకార భూమి తనఖా కేంద్ర బాంకుకు అధ్యక్షస్థానంలో చూచిన సన్నిహిత మిత్రుడొక ఉత్తరం వ్రాస్తూ యిలా వ్యాఖ్యానించాడట – “చైనాలో పూర్వం ఒక బంగారు పిట్ట ఉండేది. దాని కంఠస్వరం వర్ణనాతీతంగా ఉండేది. అందువలన చైనావారు ఆ పిట్టను ఒక పంజరంలో అట్టిపెట్టారు” ఈ అభిప్రాయం ఎలావున్నా, కొంచెం …

పూర్తి వివరాలు

సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

balashowri Reddy - Ravoori Bharadvaaja

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ …

పూర్తి వివరాలు

కలిమిశెట్టి మునెయ్య – జానపద కళాకారుడు

మునెయ్య

ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు …

పూర్తి వివరాలు

కడప జిల్లా రంగస్థల నటులు

రంగస్థల నటులు

అది క్రీ.శ 1895 ప్రాంతం – శ్రీ వనారస సోదరులు రాయచోటి తాలూకా సురభి గ్రామంలో నివాసం ఏర్పరుచుకొని ప్రప్రధమంగా ‘కీచకవధ’ నాటకం ప్రదర్శించారు. ఆ సమయంలో చంద్రగిరి నుండి వలస వచ్చిన శ్రీ సుబ్బదాసు గారు ఈ వనారస సోదరుల తోడ్పాటుతో సురభి గ్రామంలో ‘శ్రీ శారదా మనోవినోదినీ సంగీత నాటక …

పూర్తి వివరాలు
error: