వార్తలు

నేడు జిల్లాకు ముఖ్యమంత్రి

నీటిమూటలేనా?

కడప: సాగునీటి ప్రాజెక్టులపైన అఖిలపక్షం ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు (శుక్రవారం) జిల్లా పర్యటనకు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన గాలేరు – నగరి సుజల స్రవంతి కాల్వలను వాయుమార్గంలోపరిశీలించనున్నారు. మధ్యాహ్నం గండికోట జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం …

పూర్తి వివరాలు

సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన అఖిలపక్షం

కర్నూలు: రాయలసీమకు సాగునీటిని మళ్లించే పోతిరెడ్డిపాడు నుంచి అర్ధంతరంగా నీటి విడుదల నిలిచిపోవడంతో అఖిలపక్షం నేతలు గురువారం ఇక్కడి నుంచి గండికోట రిజర్వాయరు వరకు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించేందుకు బృందంగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి గండికోట జలాశయం వరకు నీరు విడుదల చేసుకునేందుకు ఉన్న అడ్డంకులపై పరిశీలించారు. ఏస్థాయిలో …

పూర్తి వివరాలు

‘ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు’

అఖిలపక్ష సమావేశం

ఒంటిమిట్ట స్ఫూర్తితో ఉద్యమించాల 25, 26వ తేదీల్లో ప్రాజెక్టుల పరిశీలన కడప: జిల్లాలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని అఖిలపక్షం నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికనేత సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ …

పూర్తి వివరాలు

ఒంటిమిట్ట రాముడికే : దేవాదాయ శాఖా మంత్రి

జిల్లా కలెక్టర్ కెవిరమణ, ప్రభత్వ విప్ మేడా మల్లిఖార్జునరేడ్డిలతో కలిసి కోదండరామాలయాన్ని పరిశీలిస్తున్న దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రసాద్.

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని …

పూర్తి వివరాలు

గంగమ్మను దర్శించుకున్న నేతలు

అనంతపురం గంగమ్మ దేవళం

అనంతపురం: గంగమ్మ జాతరలో గురువారం నేతల సందడి కనిపించింది. అమ్మవారిని దర్శించుకోడానికి నాయకులు తరలిరావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలో గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది. శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు.రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి …

పూర్తి వివరాలు

ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా …

పూర్తి వివరాలు

చిరుతపులిని తగులబెట్టిన రైతు

ప్రాణుల పేర్లు

మైదుకూరు: మండలంలోని మిట్టమానుపల్లెకు చెందిన రైతు మూలే రామసుబ్బారెడ్డి తన పంటపొలాలను అడవి జంతువుల నుంచి రక్షించుకొనే నేపధ్యంలో తన తోటకు విద్యుత్ వైర్లతో కంచె వేశాడని, రాత్రివేళ చిరుత వచ్చి విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందిందని, చిరుత మృతిచెందడంతో రైతు రామసుబ్బారెడ్డి శక్రవారం స్టార్టర్ ఆయిల్ చిరుతపై పోసి నిప్పుపెట్టి ఆనవాలు …

పూర్తి వివరాలు

మనమింతే!

మనమింతే

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం …

పూర్తి వివరాలు

తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

drinking water

కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు చెప్పిన సమాచారం ఆసక్తికరంగా ఉంది. బోర్లలో అదనంగా పైపులు వేయడానికి, తాగునీటి రవాణాకు జిల్లాకు ఎన్ని నిధులు మంజూరయ్యాయో చెప్పాలని వైకాపా ప్రజాప్రతినిధులు కోరగా జిల్లాలో తాగునీటి సమస్యల …

పూర్తి వివరాలు
error: