వార్తలు

కడప గడపలో సీమ ఆకలి ‘కేక’ అదిరింది

ఉద్యమాలు నాయకుల నుంచి కాదు… ప్రజల్లో నుంచి వస్తాయి అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కొత్తతరం నాయకులతోనే రాయలసీమకు న్యాయం రాజధాని ప్రకటనతో ముఖ్యమంత్రి సీమ వాసులను కించపర్చారు “శివరామకృష్ణన్, శ్రీకృష్ణ కమిటీలతో పాటు హోం శాఖల నివేదికలు కూడా రాజధానిగా విజయవాడ అనుకూలం కాదని తేల్చి చెప్పాయి.. సోషల్ అసెస్‌మెంట్ కమిటీ …

పూర్తి వివరాలు

భద్రత తొలగింపుపై హైకోర్టుకు వెళ్లిన వై.ఎస్.కుటుంబం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ లు తమ భద్రత కోసం కోర్టుకు వెళ్లవలసి వచ్చింది. తమకు ఉన్న ప్రాణ హానిని పరిగణనలోకి తీసుకోకుండా తమకు ఉన్న సెక్యూరిటీని ప్రభుత్వం ఉపసంహరించిందని వారు ముగ్గురు హైకోర్టు ను ఆశ్రయించారు. తాను ఇప్పటికే ఈ విషయమై పోలీసు …

పూర్తి వివరాలు

‘వారిని కోటీశ్వరులను చేసేందుకే’ – కర్నూలు ఎమ్మెల్యేలు

సీమపై వివక్ష

ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి , గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలు విమర్శించారు.. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. నలభై ఐదు …

పూర్తి వివరాలు

బంద్ సంపూర్ణం

కడప : వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే.. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గురువారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్ల పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల …

పూర్తి వివరాలు

ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా …

పూర్తి వివరాలు

ఇక శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మనోడే!

sv satish

కడప జిల్లాకు చెందిన ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కనుంది. డిప్యూటీ చైర్మన్ పదవికి టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ సతీష్ ఒక్కరే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాజకీయ సమీకరణల నేపధ్యంలో టీడీపీ నుంచి ఎన్నికైన అభ్యర్థిని రంగంలోకి దింపితే తాము పోటీలో …

పూర్తి వివరాలు

ఈశ్వర్‌రెడ్డి సేవలు ఆదర్శనీయం

ఎద్దుల ఈశ్వర్ రెడ్డి

కడప: కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్‌ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం …

పూర్తి వివరాలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

rsf

కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ …

పూర్తి వివరాలు

ఈ పొద్దు నుంచి శ్రీ నారాపుర వేంకటేశ్వరుని పవిత్రోత్సవాలు

narapura venkateswara swamy temple

తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. …

పూర్తి వివరాలు
error: