వార్తలు

చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

చిన్న క్షేత్రాలనూ

నిన్నమొన్నటిదాకా కడప జిల్లా మొత్తానికి ప్రసిద్ధిచెందిన దేవాలయం అంటే ‘దేవుని కడప’ ఒక్కటే గుర్తొచ్చేది. ఇప్పుడు స్వదేశ్ దర్శన్ కింద జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన నాలుగు కేంద్రాల్లో దేవుని కడప ప్రస్తావనే లేదు. ఆ నాలుగు కేంద్రాలు: ఒంటిమిట్ట కోదండరామాలయం, పుష్పగిరి చెన్నకేశవాలయం, అమీన్ పీర్ దర్గా, గండికోటలోని మసీదు. ఒంటిమిట్టను …

పూర్తి వివరాలు

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన బిల్లులో కృష్ణానది నీటి యాజమాన్య బోర్డును ఏర్పాటు చేసిన విషయం విదితమే. కృష్ణానది నీటిపై ఆధారపడిన ఒక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం, అదే సందర్భంలో కృష్ణా నది నీటిపై …

పూర్తి వివరాలు

వైఎస్ అంతిమ క్షణాలు…

రచ్చబండ గురించి సెప్టెంబర్ 1న ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం, కార్యదర్శి భాస్కరశర్మలతో మాట్లాడుతున్న వైఎస్

రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి …

పూర్తి వివరాలు

పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్  ఆచార్య రఘునాథరెడ్డి …

పూర్తి వివరాలు

సిద్ధేశ్వరమా..! నీవెక్కడిదానవే? : పినాకపాణి

సిద్ధేశ్వరం

చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసుల‌ను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు. మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల‌ సమస్య అయింది. ముందు రోజే హౌస్‌ అరెస్టులు చేశారు. నాయకుల‌ కోసం ఆరా తీసి …

పూర్తి వివరాలు

నైజీరియాలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా కడప వాసి

నాగభూషణరెడ్డి

నాగ‌భూష‌ణరెడ్డి స్వస్థలం ప్రొద్దుటూరు కడప: ఇండియ‌న్ ఫారెన్ స‌ర్వీస్ అధికారి బి.నాగ‌భూష‌ణ రెడ్డి(B.N.రెడ్డి)  నైజీరియా దేశంలో భార‌త హైక‌మిష‌న‌ర్‌గా నియ‌మితుల‌య్యారు. నాగ‌భూష‌ణరెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా, ప్రొద్దుటూరు. తండ్రి పేరు డాక్టర్ బి. రామ‌సుబ్బారెడ్డి. నాగ‌భూష‌ణ్ 1993 బ్యాచ్ కు చెందినా ఐఎఫ్ఎస్ అధికారి. ప్ర‌స్తుతం నాగ‌భూష‌ణ రెడ్డి జెనీవాలోని “ప‌ర్మినెంట్ మిష‌న్ …

పూర్తి వివరాలు

భారీగా మోహరించి…చెక్ పోస్టులు పెట్టి … రోడ్లను తవ్వి…

సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన

ఆటంకాలు దాటుకొని అలుగుకు శంకుస్థాపన నిర్భందాలు దాటుకుని వేలాదిగా తరలి వచ్చిన జనం అడుగడుగునా అడ్డంకులు కల్పించిన ప్రభుత్వం సిద్దేశ్వరం వెళ్ళే దారిలో వందలాది తనిఖీ కేంద్రాలు రైతునాయకుల అరెస్టుకు పోలీసుల విఫలయత్నం ప్రతిఘటించిన రైతులు (సిద్దేశ్వరం నుండి మా ప్రత్యేక ప్రతినిధి) వాళ్ళు దారి పొడవునా తనిఖీల పేరుతో కాపు కాశారు. …

పూర్తి వివరాలు

రాయలసీమ ఉద్యమ నేతల అరెస్టు

ఉద్యమ నేతల అరెస్టు

బరితెగించిన తెదేపా ప్రభుత్వం పోలీసుల అదుపులో బొజ్జా  గృహనిర్భందంలో భూమన్ ప్రభుత్వానికి మద్ధతుగా బరిలోకి దిగిన పచ్చ నేతలు, మీడియా కడప: శాంతియుతంగా సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం సిద్ధమవుతున్న రాయలసీమ రైతు నాయకులపైకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యుక్తులవుతున్న నేతలను కర్నూలు జిల్లాలో పలుచోట్ల పోలీసులు …

పూర్తి వివరాలు

సిద్దేశ్వరం అలుగుపై రంగంలోకి దిగిన నిఘావర్గాలు

సిద్దేశ్వరం అలుగుపై

మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన? కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే …

పూర్తి వివరాలు
error: