కవితలు

గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

vinakamayya

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ …

పూర్తి వివరాలు

ఆనకట్టలు తెగే కాలం (కవిత) – డా. ఎం హరికిషన్

సిద్దేశ్వరం ..గద్దించే

జండా యెగరేసి పప్పూబెల్లాలు పంచిపోవడం కాదు వ్యధల సీమలో వెలుగుపూలు పూయించే అజండా యేమిటో విప్పి చెప్పు సమన్యాయం సమాధయి సమదూరం వెక్కిరిస్తోంది ….. రాజధానే కాదు అన్నిటి ప్రవాహమూ అటువైపే … వికేంద్రీకరణంటే …. ఖాళీ గిన్నెలో తలావొక మెదుకు విదిల్చడం కాదు అడుగుతున్నది భిక్ష అంతకంటే కాదు…. ఒప్పందాలకు నీళ్ళొదిలినందుకే …

పూర్తి వివరాలు

రాయలసీమ బిడ్డలం (కవిత) – సొదుం శ్రీకాంత్

రాయలసీమ

అమ్మని ఆదరిచ్చే కమ్మని గోరుముద్దలమైతాం కొమ్ముగాసి రొమ్ము గుద్దితే పోరుగిత్తలమైతాం రాగిసంగటి ముద్దలం రాయలసీమ బిడ్డలం బందువుగా చూశావా బాహువుల్లో బందిచ్చాం బానిసగా ఎంచితే పిడిబాకులమై కబళిచ్చాం రేగటిసేను విత్తులం రాయలగడ్డ బిడ్డలం కలిసి నడిచ్చే కారే కన్నీటికి సాచిన దోసిల్లమైతాం కాదని నమ్మిచ్చి నడ్డిడిచ్చే కారుచిచ్చై దహిచ్చాం రేపటితరం స్వప్నాలం రాయలసీమ …

పూర్తి వివరాలు

సీమ సినుకయ్యింది – సొదుం శ్రీకాంత్

రాయలసీమ

సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది సినుకు సినుకే రాలి సుక్క సుక్కే చేరి ఊరి వంకై పారి ఒక్కొక్కటే కూరి పెన్నేరుగా మారి పోరు పోరంట ఉంది పోరు పెడతా ఉంది సీమ సినుకయ్యింది ముసురు మొబ్బయ్యింది దారి ఏరయ్యింది ఊరు పోరయ్యింది మెడలు వంచాలంది మడవ …

పూర్తి వివరాలు

తేల్సుకుందాం రార్రని తెగేసి సెప్పక!

సీమపై వివక్ష

ఒరే అబ్బీ..ఒరే సిన్నోడా పొగబండీ..ల్యాకపాయ ఒరే సంటోడా..ఒరే సన్నొడా ఎర్ర బస్సూ కరువైపాయ అబ్బ పాలెమాలినా.. జేజికి బాగ లేకపొయినా గుంతల దోవలే దిక్కైపాయ తాతల కాలం నుంచీ పొగబండ్లని ఇనడమేకానీ ఎక్కిన పాపాన పోల్యా ఉత్తర దిక్కు రైలు యెల్తాంటే సిత్తరంగా ముక్కున ఎగసూడ్డమే కానీ కాలు మింద కాలేసుకోని కూచ్చోని …

పూర్తి వివరాలు

రాజధాని వాడికి…రాళ్ళ గంప మనకు

రాయలసీమ

రాజధాని వాడికి రాళ్ళ గంప మనకు సాగు నీళ్ళు వాడికి కడగండ్లు మనకు స్మార్ట్ సిటీలు వాడికి చితి మంటలు మనకు వాటర్ బోర్డ్ వాడికి పాపర్ బ్రతుకులు మనకు ఎయిమ్స్ వాడికి ఎముకల గూల్లు మనకు అన్నపూర్ణ వాడికి ఆకలి చావులు మనకు పోలవరం వాడికి కరువు శాపం మనకు యూనివర్సిటీలు …

పూర్తి వివరాలు

బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి

mncs

వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్‌, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్‌ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా …

పూర్తి వివరాలు
error: