వ్యాసాలు

తెలుగుతనాన్నిఆరవోసిన ‘గాథా త్రిశతి’

GathaTrisati

సామాజిక నిష్ఠ కలిగియున్న రసం ఏదైనా కావ్యాన్ని చిరస్థాయి స్థితిలో నిల్పుతుంది అనేది అలంకారికుల అభిప్రాయం. విశ్వజనీనమైన, విశ్వసృష్టికి ఆధార భూతమైన, సకల ప్రాణికోటికి సమాన ధర్మమైన శృంగారం ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన స్థానాన్ని పొందబట్టే భోజుడు శృంగార ఏవ ఏకోరసం’’ అన్నాడు. అందుకేనేమో ఒకటవ శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించిన …

పూర్తి వివరాలు

‘నాది పనికిమాలిన ఆలోచన’

Sodum Jayaram

“జ్ఞాపకశక్తికీ నాకూ చుక్కెదురు. విశ్వం, నేనూ ఎప్పుడు దగ్గరయ్యామో నాకు సరిగ్గా గుర్తు లేదు. ఇద్దరం ప్రొద్దుటూరు మునిసిపల్ హైస్కూల్లో చదువుకున్నాం. కానీ ఆ రోజుల్లో మా ఇద్దరికీ స్నేహం అయినట్టు లేదు. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్న రోజులలో రా.రా గారు కడపకొచ్చారు. ఆయన ఎక్కడెక్కడి వాళ్ళను ఒకచోట చేర్చారు. గజ్జల మల్లారెడ్డి, …

పూర్తి వివరాలు

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ …

పూర్తి వివరాలు

జయరాం కథలు..వాడని మల్లెలు!

‘థాకరే బతకడం కోసం రాశాడు, డికెన్స్ రాయాలి కాబట్టి రాశాడు’ అన్నాడు జార్జి శాంప్సన్. సొదుం జయరాం కూడా అంతే. ‘పుణ్యకాలం మించిపోయింది’ అన్న కథలో నాయకుడు గోపాలకృష్ణ కథా రచయితే. అతడి గురించి రాసిన మాటలు జయరాంకూ వర్తిస్తాయి. దీపావళి కథల పోటీకి రాయమని గోపాలకృష్ణ భార్య పోరు పెడుతుంది. బహుమతి …

పూర్తి వివరాలు

వైసివి రెడ్డి (ఎమ్మనూరు చినవెంకటరెడ్డి)

అప్పుదెచ్చి కవులకిచ్చును, తప్పక ఋణదాతకిచ్చు తానేమగునో – ఉప్పలపాటి వెంకట నరసయ్య భావకవితోద్యమ స్రవంతి వొరిగి పొరిలేవేళ రాయలసీమలో ”తొలకరి చినుకులు” కురిపించి, సెలయేరై విజృంభించి సంగమింప చేసిన అభ్యుదయ కవితావేశ మూర్తి వైసివిరెడ్డి. వైసివి రెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి – కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల …

పూర్తి వివరాలు

హృదయమున్న విమర్శకుడు – రారా!

రాచమల్లు రామచంద్రారెడ్డి

రా.రా .గా ప్రసిద్ధుడయిన విమర్శకుడూ, సంపాదకుడూ, కథకుడూ, అనువాదకుడూ సిసలయిన మేధావీ – రాచమల్లు రామచంద్రారెడ్డి (1922-88) హృదయమున్న రసైకజీవి! స్వపరభేదాలు పాటించని విమర్శకుడు. పిసినారి అనిపించేటంత పొదుపరి కథకుడు. ముళ్లలోంచి పువ్వులను ఏరే కళలో ఆరితేరిన సంపాదకుడు. మూలరచయిత మనసును లక్ష్యభాషలోని పాఠకుడికి సమర్థంగా చేర్చిన అనువా దకుడు. అక్షరాంగణంలో నిలువెత్తు …

పూర్తి వివరాలు

కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం – నటి టి.జి.కమలాదేవి

(తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్)  తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్‌ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా …

పూర్తి వివరాలు

రాయలసీమ కథలకు ఆద్యులు (వ్యాసం) – వేంపల్లి గంగాధర్

నాలుగు జిల్లాల రాయలసీమ. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. వర్షాల్లేక బీడు పడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడే గ్రామాలు, రాజకీయ నాయకులతో పాటూ పెరుగుతున్న ఫ్యాక్షన్ కక్షలు వీటన్నిటి వలయాల మధ్యనుంచి సీమ కథా సాహిత్యం నిర్మితమవుతూ వచ్చింది. కరువు, కక్షలు, దళిత, స్ర్తి, రాజకీయ, ప్రేమ …

పూర్తి వివరాలు

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం

రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను …

పూర్తి వివరాలు
error: