సాహిత్యం

వానొచ్చాంది (కవిత)

రాయలసీమ రైతన్నా

ఆకు అల్లాడ్డంల్యా గాలి బిగిచ్చింది ఉబ్బరంగా ఉంది ఊపిరాడ్డంల్యా ఉక్క పోచ్చాంది వంతు తప్పేట్లు లేదు వంక పారేట్లే ఉంది. పొద్దు వాల్తాంది మిద్దెక్కి సూచ్చనా వానొచ్చాదా రాదా? పదునైతాదా కాదా? అదును దాట్తే ఎట్లా? ఏడు పదుల కరువు పందికొక్కుల దరువు పంకియ్యని ప్రభువు ముదనష్టపు అప్పు ఉరితాళ్ళ బతుకు. అద్దద్దో…ఆపక్క …

పూర్తి వివరాలు

సుక్కబొట్టు పెట్టనీడు… జానపదగీతం

సుక్కబొట్టు పెట్టనీడు

అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది.  సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) …

పూర్తి వివరాలు

కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

శివారెడ్డి

క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, …

పూర్తి వివరాలు

కల్లబొల్లి రాతల రక్తచరిత్ర

రక్తచరిత్ర

గంజి కరువు దిబ్బ కరువు ధాతు కరువు డొక్కల కరువు నందన కరువు బుడత కరువు ఎరగాలి కరువు పెద్దగాలి కరువు పీతిరి గద్దల కరువు దొర్లు కరువు కరువులకు లేదిక్కడ కరువు ఎండిపోయిన చెట్లు బండబారిన నేలలు కొండలు బోడులైన దృశ్యాలు గుండెలు పగిలిన బతుకులు ఇదే అనాదిగా కనిపిస్తున్న రాయలసీమ …

పూర్తి వివరాలు

నన్నెచోడుడు

నోరెత్తని మేధావులు

నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు …

పూర్తి వివరాలు

అన్నమయ్య కథ : ఐదో భాగం

అన్నమయ్య

అన్నమయ్య ఆలయ ప్రవేశం: అన్నమయ్య ఆదివరాహస్వామిని సేవించుకొని వేంకటేశ్వరస్వామి కోవెలకు వెళ్లాడు. పెద్ద గోాపురాన్ని ఆశ్చర్యంగా చూశాడు. అక్కడ పెద్ద చింతచెట్టు ఉండేది. దానికి మ్రొక్కాడు. కోరిన కోర్కెలు తీర్చే గరుడగంభానికి సాగిలపడ్డాడు . పెద్ద పెద్ద సంపెంగ మానులతో నిండి ఉన్న చంపక ప్రదక్షిణం చుట్టాడు. విమాన వేంకటేశ్వరుని దర్శించాడు. రామానుజులవారిని …

పూర్తి వివరాలు

వీర ప్రేక్షకులు (కవిత)

chidambarareddy

వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. మాటల గాలిపటాల్ని గీసి మిరుమిట్ల మిణుగుర్లతికించి హద్దుల్లేని ఆకాశంలో మేకే అందని అతి ఎత్తుల్లో ప్రదర్శనలు సాగిస్తుంటాడు. కలలెందుకు కనాలో కన్న కలలకు దార్లెలా వేయాలో ప్రయత్నించే మీరు మీ మేధస్సే …

పూర్తి వివరాలు

అన్నమయ్య కథ : 4వ భాగం

అన్నమయ్య

అలమేలు మంగమ్మ – అనుగ్రహం అన్నమయ్య అలసటను, ఆకలిని ఎవరు గమనించినా ఎవరు గమనిమ్పకపోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. మంగమ్మ పెద్ద ముత్తైదువులా అన్నమయ్యను సమీపించింది. తన ఒడిలో చేర్చుకుని శరీరం నిమురుతూ “లే! బాబూ, లేచి ఇలా చూడు” అన్నది. అన్నమయ్యకు తన తల్లి లక్కమాంబ పిలుస్తున్నట్లనిపించింది. “అమ్మా!” అని …

పూర్తి వివరాలు

సియ్యల పండగ (కథ) – తవ్వా ఓబుల్‌‌రెడ్డి

shivudu

”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్‌! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ …

పూర్తి వివరాలు
error: