సాహిత్యం

భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

Bammera Pothana

– విద్వాన్ కట్టా నరసింహులు బమ్మెరపోతన ఆంధ్రమహాభాగవత రచనకు కొన్నాళ్లముందు చంద్రగ్రహణం నాడు గంగలో స్నానం చేసి ధ్యానం చేస్తున్నాడు. అది మహేశ్వర ధ్యానం. ధ్యానంలో దర్శనమిచ్చినవాడు శ్రీరామభద్రుడు. భాగవతం రచించమన్నాడు. ఆయనకు కలలో కనిపించిన రాముడిలా ఉన్నాడు: మెఱుగు చెంగట నున్న మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ నొప్పువాడు చంద్రమండల …

పూర్తి వివరాలు

నేటి రాజకీయాలపై గ్రామీణ మహిళల జానపద చెణుకులు!

గుడిసెనపల్లి నాగమ్మ బృందం

మైదుకూరు: సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు ఒక పక్క రాష్ట్ర రాజకీయాల్లో సెగమంటలు రేపుతుంటే మరో పక్క సాంస్కృతిక స్పృహను రగుల్కొలుపుతోంది. రాయలసీమ ప్రాంతం సాంస్కృతిక వైవిధ్యానికి ఆలవాలమైన ప్రాంతం. ఇక్కడి ప్రజల మాటల్లో నిజాయితీ, నిక్కచ్చితనం ఉట్టిపడుతూ ఉంటుంది.ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు ఖరాఖండీగా చెప్పడం ఈ ప్రాంత ప్రజల మనస్తత్వం. మాటైనా , …

పూర్తి వివరాలు

చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

chennai

గుడికూలును నుయి పూడును వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ చెడనిది పద్యం బొక్కటి కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా! వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల …

పూర్తి వివరాలు

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

అల్లసాని పెద్దన

ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. …

పూర్తి వివరాలు

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

Kuchipudi

బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1 శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని కోపామునేసి కొట్టగా ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ            1బే1 తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ దేవాసురులెల్ల గూడగ దోవసూసి …

పూర్తి వివరాలు

తెలుగుతనాన్నిఆరవోసిన ‘గాథా త్రిశతి’

GathaTrisati

సామాజిక నిష్ఠ కలిగియున్న రసం ఏదైనా కావ్యాన్ని చిరస్థాయి స్థితిలో నిల్పుతుంది అనేది అలంకారికుల అభిప్రాయం. విశ్వజనీనమైన, విశ్వసృష్టికి ఆధార భూతమైన, సకల ప్రాణికోటికి సమాన ధర్మమైన శృంగారం ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన స్థానాన్ని పొందబట్టే భోజుడు శృంగార ఏవ ఏకోరసం’’ అన్నాడు. అందుకేనేమో ఒకటవ శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించిన …

పూర్తి వివరాలు

సీమ జానపద గేయాన్ని పవన్ కల్యాణ్ ఖూనీ చేశాడా?

Pawan Kalyan

“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే! శ్రీ మహావిష్ణువు దశావతారాలను …

పూర్తి వివరాలు

బహుళజాతి చిలుకలు (కవిత) – తవ్వా ఓబుల్ రెడ్డి

mncs

వాణిజ్య ప్రకటనల యవనిక పై ఏ సూడో రైతు నాయకుడో వెండితెర వేలుపో ప్రత్యక్షమై బహుళజాతి చిలుకల్లా పలుకుతున్నారు చితికిన కొబ్బరి రైతు సాక్షిగా బోండాముల్లో హలాహలాన్ని చిమ్మి కోలాల కోలాహలం సృష్టిస్తున్నారు ఖాజీపేట గోళీసోడా, మైదుకూరి నన్నారి షర్బత్‌, అనాగరిక పానీయాలంటున్నారు పులియో గరే, కుర్‌ కురే, పిజ్జా, బర్గర్లను మహాప్రసాదాలుగా …

పూర్తి వివరాలు

రాజవు నీకెదురేదీ రామచంద్ర – అన్నమయ్య సంకీర్తన

ఇందులోనే కానవద్దా

గండికోట శ్రీరామచంద్రుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటను చేరిన ‘పదకవితా పితామహుడు’ అక్కడి రాముని సేవించి తరించినాడు.  గండికోట శ్రీరామచంద్రునికి అన్నమయ్య సమర్పించిన సంకీర్తనా నీరాజనమిది…. వర్గం : శృంగార సంకీర్తన కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: …

పూర్తి వివరాలు
error: