సాహిత్యం

రాయలసీమ కథలకు ఆద్యులు (వ్యాసం) – వేంపల్లి గంగాధర్

నాలుగు జిల్లాల రాయలసీమ. రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతం. వర్షాల్లేక బీడు పడిన భూములు, సాగునీరు, తాగునీరు లేక అల్లాడే గ్రామాలు, రాజకీయ నాయకులతో పాటూ పెరుగుతున్న ఫ్యాక్షన్ కక్షలు వీటన్నిటి వలయాల మధ్యనుంచి సీమ కథా సాహిత్యం నిర్మితమవుతూ వచ్చింది. కరువు, కక్షలు, దళిత, స్ర్తి, రాజకీయ, ప్రేమ …

పూర్తి వివరాలు

నవ వసంతం (కథ) – తవ్వా ఓబుల్ రెడ్డి

విజయరాఘవరెడ్డి మొగసాలలో అరుగుపై కూర్చుని గంగులయ్యతో గడ్డం గీయించుకుంటున్నాడు. గేటు దగ్గర ఇద్దరు అంగరక్షకులు పరిసరాలను గమనిస్తున్నారు. ఇస్త్రీ బట్టల మోదతో వచ్చిన రామన్న వాటిని మంచంపై పెట్టి రెడ్డెమ్మ కోసం ఇంట్లోకి కేక వేసినాడు. ”గడ్డం గీకేటప్పుడు సేతులెందుకు వణికిచ్చవురా? పిరికి నాయాలా” అద్దంలో మొహాన్ని చూసుకుంటూ గంగులయ్యను మందలించినాడు విజయరాఘవరెడ్డి. …

పూర్తి వివరాలు

నరులారా నేడువో నారసింహ జయంతి — అన్నమాచార్య సంకీర్తన

నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను || సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివారం మందు సంధ్యాకాలమున ఔభళేశుడు | పొందుగా కంభములో పొడమి కడప మీద కందువ గోళ్ళ చించె కనక కశిపుని || నరమృగరూపము నానాహస్తముల అరిది శంఖచక్రాది ఆయుధాలతో గరిమ ప్రహ్లాదుని కాచి …

పూర్తి వివరాలు

రాములవారి గుడి ముందు (కథ) – డా|| ఎల్‌.విజయమోహన్‌రెడ్డి

పుస్తకాల సంచీ బీరువా కింద దాచేసి, సరాసరి వంటింట్లోకి వెళ్ళబోయి, అంతగా పరుగెత్తుకొచ్చినందుకు అత్తయ్య కోప్పడుతుందేమోనన్న విషయం గుర్తొచ్చి గుమ్మంలోనే ఆగిపోయి లోపలికి తొంగి చూశాడు శివు. రంగమ్మ రొట్టెలు చేస్తూంది. చాలా సేపట్నుంచీ పొయ్యిముందు కూర్చుని పనిచేయడం వల్ల ఆమె ముఖమంతా చెమటతో తడిసివుంది. నొసటి కుంకుమ కరిగి ముక్కుమీదుగా కారి …

పూర్తి వివరాలు

రాయలసీమ జానపదం – తీరుతెన్నులు:అంకె శ్రీనివాస్

రాయలసీమ జానపదం

రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను …

పూర్తి వివరాలు

తరం-అంతరం (కథ) – చెన్నా రామమూర్తి

ఎడ్లబండి కదిలింది. చెరువు కానుకొని ఉండే దట్టమైన చీకిచెట్ల నుంచి కీచురాళ్లు రొద చేస్తానే ఉండాయి ఆగకుండా! చుక్కలు లేని ఆకాశం చినుకులు కురిపించడానికి సిద్దమవుతున్నట్లుగా ఉంది. కందెన తక్కువై ఇరుసు చేస్తున్న శబ్దం… రాయి ఎక్కి దిగినపుడు చక్రం మీదున్న కమీ చేస్తున్న శబ్దం… ఎద్దుల గిట్టల శబ్దం… సుతారంగా కదిలే …

పూర్తి వివరాలు

ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

ఓడిపోయిన సంస్కారం

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో …

పూర్తి వివరాలు

“రండి, వచ్చి చూడండి… తర్వాత మాట్లాడదాం” : కడప పర్యటన – 2

కడప పర్యటన

గండికోట, బ్రహ్మం సాగర్, తాళ్ళపాక, పెద్ద దర్గా … అని చెప్పేశాక అమర్ అన్నాడు ‘నేచర్ టూర్ లాగా ప్లాన్ చేద్దాం, గుళ్ళూ గోపురాలూ కాకుండా…’ అని. వెంటనే ఒక రూట్ మ్యాపు తయారుచేశాం. దానిని జట్టు సభ్యులకు పంపించాం. ‘కడపలో ఏముంది?’ అన్న ఆనంద్ ప్రశ్నను చాలా మంది మళ్ళీ మళ్ళీ …

పూర్తి వివరాలు

కడుపాత్రం (కథ) – తవ్వా ఓబుల్‌రెడ్డి

కడుపాత్రం

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే …

పూర్తి వివరాలు
error: