చరిత్ర

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

అల్లసాని పెద్దన

ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. …

పూర్తి వివరాలు

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. ఆ గ్రంథం అముద్రితం. వావిళ్ల వారి శ్రీమదాంధ్ర భాగవత ముద్రణలోని శేషాద్రి రమణ …

పూర్తి వివరాలు

పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం “దుర్గం కోట “

పులివెందుల: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కాని వారి నిర్మించిన కట్టడాలు మాత్రం మనకు సజీవ సాక్ష్యాలు గా కనిపిస్తాయి. అప్పట్లోనే కారడవుల్లో విశాలమైన కోటలు నిర్మించారు. కానీ వాటి గురించి నేడు పట్టించుకొన్ననాధుడే లేడు. కాల గర్భంలో ఒక్కొక్కటే కలసి పోతున్నాయి. ఈ పురాతన కట్టడాలు ఉన్న ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా …

పూర్తి వివరాలు

మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

కలమళ్ళ శాసనం

కడప జిల్లాలోని కలమళ్ళ గ్రామంలో గల శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో క్రీ.శ. 575లో రేనాటి చోళరాజు ధనుంజయ వర్మ వేయించిన శాసనాన్ని 1904లో మద్రాసు శాసన పరిశోధన విభాగం వారు గుర్తించారు. నేటికి లభించిన తొలి తెలుగు శాసనాల్లో కలమళ్ళ శాసనమే ప్రప్రథమ మనడానికి అందులో వాడిన ప్రాచీన లిపి-భాషలే ప్రమాణం. …

పూర్తి వివరాలు

1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం …

కడపలో గాంధీజీ

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు. అప్పటికే సన్మాన సంఘం వారు …

పూర్తి వివరాలు

కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

మాలెపాడు శాసనము

విజయనగర చరిత్రలో కడప ప్రాంతానికి కూడా విశిష్టమైన స్థానం ఉన్నట్లు ఈ ప్రాంతంలోని వివిధ చోట్ల లభించిన శాసనాల వల్ల అవగతం అవుతోంది. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన గండికోట సీమ, సిద్దవటం సీమ, ములికినాటి సీమ, సకిలిసీమ ప్రాంతాలలోని దేవాలయాలూ, బురుజులూ, శాసనాలూ, కైఫీయతుల ద్వారా కడప జిల్లా చారిత్రక విశేషాలు వెలుగుచూస్తున్నాయి. …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో బృహత్ శిలాయుగంనాటి ఆనవాళ్లు

కడప: వైఎస్సార్ కడప జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. జిల్లాలోని సుండుపల్లె మండలం రాయవరం పంచాయతీ పరిధిలోని దేవాండ్లపల్లికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు బయటపడ్డాయి. ఇవి క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నాటివని భావిస్తున్నారు. దాదాపు 20 బృహత్ శిలాయుగం సమాధులను దేవాండ్లపల్లి వద్ద …

పూర్తి వివరాలు

‘మిసోలిథిక్‌’ చిత్రాల స్థావరం చింతకుంట

చింతకుంటలో ఆదిమానవులు గీసిన చిత్రాలు

కడప జిల్లాలోని ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలోని ఆది మానవుల శిలా రేఖా చిత్రాలను గురించి స్థూలంగా తెలుసుకుందాం. తొలిసారిగా ఇర్విన్‌ న్యూ మేయర్‌ అనే ఆస్ట్రియా దేశస్థుడు ” లైన్స్‌ ఆన్‌ స్టోన్‌ – ది ప్రి హిస్టారిక్‌ రాక్‌ ఆర్ట్‌ ఆఫ్‌ ఇండియా“ అనే పుస్తకంలో చింతకుంట రేఖా చిత్రాల గురించి …

పూర్తి వివరాలు

భక్త కన్నప్పది మన కడప జిల్లా

భక్త కన్నప్ప

భక్త కన్నప్ప కడప (వైఎస్సార్) జిల్లా వాడే. కైఫీయతుల్లో ఇందుకు స్పష్టమైన ఆధారం ఉందని ఘంటాపథంగా చెబుతున్నారు. దీంతో కన్నప్ప కర్నాటకవాడనీ, తమిళుడని, ఆ ప్రాంతాల వారు చేసిన వాదనలో నిజం లేదని స్పష్టమైంది. కన్నప్ప వైఎస్సార్ జిల్లావాడేననడానికి రుజువుగా ఆయన ప్రతిష్టించిన శివలింగం రాజంపేట మండలం ఊటుకూరులో నేటికీ ఉందని పండిత పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.

పూర్తి వివరాలు
error: