సిపిబ్రౌన్

సిపి బ్రౌన్ పుట్టిన రోజు

కడప కేంద్రంగా తెలుగు బాషా సముద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్‌. వీరు 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో తండ్రి మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. 1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు.

1826లో రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. కడపలో గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు.

1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువులను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు.

1841లో చెన్న పట్టణ  పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత మదరాసు  విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు.

తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే  చందస్సును అచ్చు వేయించారు.  ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు .

ఇదీ చదవండి!

మేడిదిన్నె హనుమంతాలయం

అన్నమయ్య దర్శించిన మేడిదిన్నె హనుమంతాలయం

Calendar Add to Calendar Add to Timely Calendar Add to Google Add to Outlook Add …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: