‘డబ్బులిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాల’

కడప: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్షం నేతలు అన్నారు.

శనివారం అఖిలపక్షం నేతలు కలెక్టరేట్ ఆవరణలో నీటిపారుదల శాఖ సీఈ వరదరాజుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయినన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.1800 కోట్లు నిధులు కేటాయించాలన్నారు.

గండికోట జలాశయానికి నీరు తీసుకొచ్చేందుకు సంబంధిత పనులు పూర్తి చేయాలని, అవుకు నుంచి గండికోట వరకు, బనకచెర్ల నుంచి అవుకు వరకు నిల్చిపోయిన పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

చదవండి :  9 నుంచి 11 వరకు కడపలో జగన్

చంద్రబాబు నాయుడు మాటల్లో కాకుండా చేతల్లో చూపాలన్నారు. జిల్లాను వెనుకబాటుకు గురి చేయరాదని కోరారు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికీ ఓట్లు వేసిన ప్రాంతాలనే భావన రావడం మంచిది కాదని.. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.

కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, అంజాద్‌బాషా, వైకాపా జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్‌రెడ్డి, సీపీం జిల్లా కార్యదర్శి నారాయణ, సీపీఐ నేత చంద్ర, రైతు విభాగ నేత చంద్రమౌళీశ్వరరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

చదవండి :  తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: