ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై 2 నెలల్లో సెయిల్ నివేదిక

కడప: కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి సాధ్యాసాధ్యాలపై  నవంబరు 30లోగా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ మేరకు కేంద్ర ఉక్కు, గనులశాఖ మంత్రి నరేంద్రసింగ్‌తోమార్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి యూపీఏ కేంద్ర ప్రభుత్వం పునర్విభజన చట్టంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. అపాయింటెడ్‌ డే (జూన్‌ 2 నుంచి) ఆరు నెలల లోపు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి నివేదిక ఇవ్వాలని సెయిల్‌కు సూచించింది.

చదవండి :  'కడపను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చెయ్యండి'

ఇదే విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ రాస్తూ, నవంబర్‌ 30లోగా సెయిల్‌ తన నివేదికను సమర్పిస్తుందని తెలియచేశారు. ఇదే విషయాన్ని తెలియచేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ డిప్యూటీ సెక్రటరీ లిఖిత పూర్వకంగా కడప జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపారు.

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

ఒక వ్యాఖ్య

  1. త్రివిక్రమ్

    12 days have passed after the deadline. Any update on this?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: