'ప్రొద్దుటూరు'కు శోధన ఫలితాలు

ప్రొద్దుటూరు మున్సిపాలిటికీ 96 వసంతాలు !

ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పురపాలక సంఘాన్ని  ఏర్పాటు చేసి 96 సంవత్సరాలు గడిచాయి. 1915వ సంవత్సరంలో రామేశ్వరం, మోడంపల్లె, నడింపల్లె, బొల్లవరం గ్రామాలను కలిపి ప్రొద్దుటూరు మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు.  2014 సంవత్సరంతో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ శత వసంతాలు పూర్తి చేసుకోనుంది. తృతీయ శ్రేణి పురపాలక సంఘం నుంచి ప్రత్యేక స్థాయి మున్సిపాలిటీకి …

పూర్తి వివరాలు

ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

కడప : తమిళ నటుడు రజనీకాంత్‌ (Rajanikanth) హీరోగా నటిస్తున్న వెట్టియన్ (vettaiyan) సినిమా షూటింగ్ కడప జిల్లాలో గత నాలుగు రోజులుగా జరుగుతోంది. ఈ షూటింగ్ లో పాల్గొనేందుకు హీరోలు రజనీకాంత్,ఫాహద్ ఫాసిల్, రానా దగ్గుబాటిలతో పాటుగా పలువురు నటులు కడప జిల్లాకు వచ్చారు. ఎర్రగుంట్ల సమీపంలో (నిడుజువ్వి) ఉన్న రాళ్ళ …

పూర్తి వివరాలు

మౌనఘోష’ పద్మావతమ్మ ఇక లేరు.!

పద్మావతమ్మ

రాయలసీమ తొలితరం వచన కవయిత్రి , ప్రముఖ రచయిత్రి, సంఘసేవకురాలు పసుపులేటి పద్మావతమ్మ (76) గురువారం కన్నుమూశారు. ‘మౌనఘోష’ కవితా సంపుటి ద్వారా కవయిత్రిగా పేరుపొందారు. చేరా, పొత్తూరి వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు మౌనఘోష గురించి ప్రత్యేకంగా రాశారు. రాధా మహిళా సమాజాన్ని స్థాపించి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. ప్రొద్దుటూరు, కడప …

పూర్తి వివరాలు

పోట్లదుర్తి – యాట కుక్కపైన కుందేళ్లు తిరగబడిన చోటు

పోట్లదుర్తి

ఈ ఊరున్న తావులో కుందేళ్ళ పైకి యాటకుక్కను ఇడిసిపెడితే ఆ యాటకుక్కపైన కుందేళ్లు తిరగబడినాయంట. ఈ తావు శౌర్యం కలిగినదని భావించి  ఇక్కడ ఊరు కట్టించగా దానికి 'పోట్లదుర్తి' అనే పేరు పొందిందట.

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ఏకగ్రీవమైన పంచాయితీలు

ఓటర్ల జాబితా

కడప: ఇప్పటి వరకు మండలాల వారీగా గ్రామ పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికయిన సర్పంచ్‌ల వివరాలు. ప్రొద్దుటూరు మండలం : సోములవారిపల్లి- మోపురి ప్రశాంతి దొరసానిపల్లి- ఆరవ ఈశ్వరమ్మ చౌటపల్లి- మార్తల లక్ష్మీ సునీత తాళ్లమాపురం- మాదిరెడ్డి కొండారెడ్డి చౌడూరు- నేతిపల్లి చండ్రాయుడు రాజుపాలెం మండలం : వెంగలాయపల్లి- దనిరెడ్డి రేణుకమ్మ కొర్రపాడు- పిల్లి …

పూర్తి వివరాలు

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

జిల్లా కేంద్రంగా కడప

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నాలుగు ప్రాంతీయ అభివృద్ధి/ప్రణాళిక మండళ్లను ఏర్పాటు చేయనుందని. నాలుగు రాయలసీమ జిల్లాలకు కలిపి కడపలో, ఉత్తరాంధ్రకు విజయనగరంలో, మధ్యాంధ్రకు కాకినాడలో, దక్షిణాంధ్రకు గుంటూరులో అన్నారు. మూడు రాజధానుల విషయంలో లాగే నగరాల …

పూర్తి వివరాలు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

పుట్టపర్తి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య …

పూర్తి వివరాలు

తప్పుదోవలో ‘బస్సు ప్రయాణం’

బస్సు ప్రయాణం

మామూలుగా ఐతే ఒక ప్రాంతం/వర్గంమీద అక్కసుతో అపోహలు, అకారణ ద్వేషం కలిగేలా రాసే కథలను విజ్ఞతగల సంపాదకులు ప్రచురించరు. ఒకవేళ ప్రచురించినా ఇలాంటి కథలకు పాత పత్రికలకు ఉన్నదానికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండదు. ఐతే ఈ కథ అలా మరుగున పడలేదు. 87 సంవత్సరాల తెలుగు కథాచరిత్రలో 87 మంది రచయితల అత్యుత్తమ …

పూర్తి వివరాలు

అగస్తేశ్వరాలయాలు – కడప జిల్లా

అగస్తేశ్వరాలయాలు

కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు. చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ …

పూర్తి వివరాలు
error: