Tag Archives: గాలి త్రివిక్రమ్ వ్యాసాలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, …

పూర్తి వివరాలు

మనమింతే!

మనమింతే

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం …

పూర్తి వివరాలు

కడప జిల్లాలో ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ – ఒక విన్నపం

kadapa district map

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కడప జిల్లా పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరించడమూ, ముఖ్యమంత్రే ఈ జిల్లా గురించి విపరీత బుద్ధితో దుష్ప్రచారం చెయ్యడమూ అందరికీ తెలిసిన విషయాలే. DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే …

పూర్తి వివరాలు

ఆశలన్నీ ఆవిరి

ఆశలన్నీ ఆవిరి

కడప జిల్లా వాసుల ఆశలన్నీ ఆవిరి కందుల సోదరులను భాజపాలో చేర్చుకోవడానికి మొన్న 18న కడపకొచ్చిన వెంకయ్య నాయుడు గారు కడప జిల్లా అభివృద్ధి విషయంలో మినుకుమినుకుమంటున్న ఆశల మీద నిర్దాక్షిణ్యంగా చన్నీళ్ళు గుమ్మరించి చక్కా వెళ్ళిపోయారు. కేంద్ర కేబినెట్లో ఆంధ్రప్రదేశ్ వాణిని బలంగా వినిపించగల నాయకుడిగా, చాలాకాలంగా ఈ ప్రాంత సమస్యలు, …

పూర్తి వివరాలు

అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2

మనమింతే

ఐజీకార్ల్: కడప జిల్లాలో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ లైవ్‌స్టాక్ (IGCARL) అనే పేరుతో ఒక (supposedly) ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థ ఏర్పాటై ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ దేశాల, సంస్థల ప్రతినిధుల రాకపోకలు నిరాటంకంగా, సౌకర్యవంతంగా సాగడానికి వీలుగా కడప విమానాశ్రయం నుంచి …

పూర్తి వివరాలు

అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -1

మనమింతే

మెగాసిటీ తెలుగువాళ్ళ కోసమా తమిళుల కోసమా? “బెంగళూరుకు ఉపనగరంగా అనంతపురాన్ని అభివృద్ధి చేయాలి.” – మొన్న (ఆగస్టు 7) కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు. అంటే బెంగళూరు నగరం యొక్క జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనంతపురం వరకు (గూగుల్ మాప్స్ ప్రకారం 214 కి.మీ.) ఉందని ఒకవైపు అంగీకరిస్తూ, మనరాష్ట్రం దక్షిణభాగంలో మెగాసిటీగా …

పూర్తి వివరాలు

ముఖ్యమంత్రి గారొచ్చారు, కొత్త బిరుదిచ్చారు

నీటిమూటలేనా?

గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారూ! రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రైన మీరు మొట్టమొదటిసారిగా నవంబర్ 8న కడప జిల్లాకు వస్తున్నారన్నప్పుడు పారిశ్రామిక రంగంలో మా జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది కాబట్టీ, రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ చేసిన ప్రకటనలో భాగంగా కడపజిల్లాలో ఖనిజాధారిత పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పుతామని ధారాళంగా మాట ఇచ్చారు కాబట్టీ …

పూర్తి వివరాలు

ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

రాష్ట్ర రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ ఇచ్చిన ప్రకటనలో కడప జిల్లాకు విదిల్చిన ముష్టిలోని మెతుకులేమిటో ఒకసారి చూద్దాం: 1. స్టీల్ ప్లాంట్: ఇది కొత్తగా కడుతున్నదేమీ కాదు. ఏడేళ్ల కిందట ప్రారంభించి, మధ్యలో ఆగిపోయిన నిర్మాణాన్ని ఇప్పుడు కొనసాగించి పూర్తిచేస్తారు, అంతే. ఐతే దీన్ని సాకుగా చూపి, కేంద్ర ప్రభుత్వ విద్య, పరిశోధనా …

పూర్తి వివరాలు

అదేనా పేదరికం అంటే?

Pedarikam

యువరాజా వారు నిద్ర లేచారు. అదేంటోగానీ రాత్రుళ్ళు ఎంతసేపు నిద్రపోయినా వారికి లేచేసరికి బద్ధకంగానే ఉంటుంది. బలవంతాన లేచినా రోజంతా ఏం చెయ్యాలో తోచిచావదు. నాన్నగారు పోయిన తర్వాత ఒక ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పట్నించి నోరూవాయీలేనివాడొకణ్ణి ప్రధానమంత్రిగా పెట్టుకుని రాజ్యవ్యవహారాలు అమ్మగారే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఆ వ్యవహారాల్లో ఒక్కటీ తన బుర్రకెక్కి …

పూర్తి వివరాలు
error: