Tag Archives: సడ్లపల్లె చిదంబరరెడ్డి

వీర ప్రేక్షకులు (కవిత)

chidambarareddy

వాడి కాగితాల చూపుల్నిండా టన్నుల కొద్దీ వ్యూహాలు. తన తల్లో వండిన కలలుగానే కొత్త రంగులు పూస్తుంటాడు కొలతలేసి చూపుతుంటాడు. మాటల గాలిపటాల్ని గీసి మిరుమిట్ల మిణుగుర్లతికించి హద్దుల్లేని ఆకాశంలో మేకే అందని అతి ఎత్తుల్లో ప్రదర్శనలు సాగిస్తుంటాడు. కలలెందుకు కనాలో కన్న కలలకు దార్లెలా వేయాలో ప్రయత్నించే మీరు మీ మేధస్సే …

పూర్తి వివరాలు

ఏందిర ఈ సీంబతుకు (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

చింతల చీకట్లో–రైతన్నల కన్నీళ్లు వలసల వాకిట్లో–కూలన్నల పడిగాపులు కొలువుల పిలుపుకై–చదువరులా ఎదురుచూపు ఏందిర ఈ సీంబతుకు–ఎన్నాళ్లీ దేబిరింపు //చింతల// సీమ బీడు సాకుజూపు–నీటి వాట తెస్తారు వాన రాలేదనిఏడ్చి– రాయితీలు రాబట్తరు రాజకీయ రాబందులె–పంచేసు కొంటారు పల్లె జనాల నోట –దుమ్ము కొట్టుతుంటారు //చింతల// నీరు మీరు అంటారు–కన్నీరై కారుతారు కాళ్లబేరానికొచ్చి–ఓట్లనడుక్కు తింటారు …

పూర్తి వివరాలు

కొత్తసీమ (పాట) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

చర్న కోల ఏదిరా-బండిగుజ్జ వెదకరా వడిశెలా చెల్లెమ్మా-మొద్దొ పరక తీయమ్మా //చర్న// వాడెవడో నిజాముగాడు మననమ్మెనంట తెల్లోనికి ఇంకెవడో ఖద్దరోడు ముక్కలుగా నరికెనంట. అరవ నాడులో చేతులు కన్నడ దేశాన తలా మొండెమే మనమిప్పుడు వంచించ బడిన బిడ్డలం //చర్న// రాజుల కాలం కాదిది- రజకీయ నక్కలార ప్రజల మాట ఆలకించి -పోరాడుదాము …

పూర్తి వివరాలు

అన్నన్నా తిరగబడు… (కవిత) – సడ్లపల్లె చిదంబరరెడ్డి

chidambarareddy

రాయల సీమజనాల్లో రగత మురికిపారాల రాజకీయ రంకుల్ని ఈడ్చి ఈడ్చి తన్నాల. ఈపొద్దు ఇంటిలోన రేపేమో మంటిలోన ఏదొకటో కాకుంటే మనకింకా ముక్తి లేదు. ఒకకంటికి సున్నము వెన్న మరో కంటికి ఆదినుండి మనసీమకు అంతులేని అన్యాయం. ప్రాజెక్టును ఇస్తామని మదరాసునుండి పిల్చినారు చుక్క నీరు ఇవ్వకుండ కిందకు మళ్లించినారు . సీమ …

పూర్తి వివరాలు
error: