Tag Archives: kadapa katha

ఏటుకాడు (కథ) – రామకృష్ణా రెడ్డి.పోసా

etukadu

ఎహె… జరగండి అవతలికి అంటాడు ఏసోబు. ఒరే… బాబ్బాబూ…. అంటారు పెద్దమనుషులు. స్నానానికి వేన్నీళ్లు పెట్టవే బోసిడీ… అని పెళ్లాన్ని తిడతాడు ఏసోబు. ఇదిగో… పెడుతున్నాను స్వామో అని పరుగు తీస్తుంది పెళ్లాము. ఇప్పుడు కాదు వెళ్లండి… రేపు అంటాడు ఏసోబు. నువ్వు ఎప్పుడంటే అప్పుడే దేవరా… అంటారు కామందులు. బీడీ- అడుగుతాడు …

పూర్తి వివరాలు

సెగమంటలు (కథ) – దాదాహయత్

dada hayat

సెగమంటలు కథ  మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి. ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల …

పూర్తి వివరాలు

శ్రుతి (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

సిద్దేశ్వరం ..గద్దించే

జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది …

పూర్తి వివరాలు

వానరాయుడి పాట (కథ) – వేంపల్లి గంగాధర్

“ఉత్తరాన ఒక వాన ఉరిమి కురవాల దక్షిణాన ఒక వాన దాగి కురవాల పడమరా ఒక వాన పట్టి కురవాల తూర్పున ఒక వాన తుళ్ళి కురవాల…” పాట సాగిపోతూ వుండాది. పాట ప్రవహిస్తా వుండాది. పాట పరవళ్ళు తొక్కుతా వుండాది. పాట పరవశిస్తా ఆడతా వుండాది. తెల్లటి ఆకాశం మీద నల్లటి …

పూర్తి వివరాలు

అంజనం (కథ) – వేంపల్లె షరీఫ్

పైన ఫ్యాను తిరుగుతోంది. తిరిగేది చిన్నగే అయినా కిటకిటా మంటూ శబ్దం పెద్దగా వస్తోంది. ఆ ఫ్యాను గాలిని ఏమాత్రం లెక్కచేయకుండా ఈగలు బొయ్యిమంటూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. నట్టింట్లో కాళ్లు బార్లా చాపుకుని దిగులుగా కూచోనుంది జమ్రూత్. “పెద్దోడు తిరిగొచ్చాడని పెద్దాసుండ్యా…” అంది ఉన్నట్టుండి. “ఇప్పుడు ఆ ఆసకు ఏమైంది?” అన్నట్టు …

పూర్తి వివరాలు

జుట్టుమామ (కథ) – ఎం.వి.రమణారెడ్డి

ఇన్నేళ్లైనా నా జ్ఞాపకాలనుండి జుట్టుమామ తొలగిపోలేదు. ఎప్పుడూ కాకపోయినా, సినిమానుండి తిరిగొచ్చే సమయంలో తప్పకుండా గుర్తొస్తాడు. గుర్తుకొస్తే మనసు బరువెక్కుతుంది. ఏదో అపరాధం చేసిన భావన నన్ను వెంటాడుతుంది. నేను చేసిన తప్పు ఇదీ అని ఇదమిత్తంగా తేల్చుకోనూలేను; దులిపేసుకుని నిశ్చింతగా ఉండనూలేను. అప్పట్లో నాది తప్పూ, నేరం తెలిసిన వయసేగాదు. అతడు …

పూర్తి వివరాలు

పాలకంకుల శోకం (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

కొండపొలం

పాలకంకుల శోకం కథ ఎదురుగా బడి కన్పించగానే గుర్తొచ్చింది కృష్ణకు – తను ఇంటివద్దనుంచి బయల్దేరేటపుడు ఈ దారిన రాకూడదనుకొంటూనే పరధ్యానంగా వచ్చాడని. సందులో దూరి పోదామనుకొన్నాడు గాని లోపల్నించి రమణసార్ చూడనే చూశాడు. “ఏమయ్యా క్రిష్ణారెడ్డి?” అంటూ అబయటకొచ్చాడు. “ఏముంది సార్..” నెత్తి గీరుకొంటూ దగ్గరగా వెళ్లాడు కృష్ణ. “బంగారంటి పాప. …

పూర్తి వివరాలు

రాతిలో తేమ (కథ) – శశిశ్రీ

మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. …

పూర్తి వివరాలు

యీటి రంగే పచ్చనేమో సామీ! (కథ) – యర్రపు రెడ్డి రామనాధ రెడ్డి

మాయింట్లో నువాక్రాను, మోనోక్రోటోపాసు, ఎండ్రీను డబ్బాలు శానా వుండేటియ్యి. వంకాయలు, బెండకాయలూ పండిస్తా వున్యాములే. వాఁటితోపాటు జాలాట్లో నాలుగు టమాటాచెట్లు, గెనాల మింద గోగాకు, చిన్న పెడలో మిరపజెట్లు గూడా. అప్పుడు మాయింట్లో కూరలేం జేచ్చాన్యామో మల్లా జెప్పాల్నా! నూనొంకాయ, వంకాయపులుసు, బెండకాయపులుసు, వంకాయ్ తాళింపు, బెండకాయ్ తాళింపు, వంకాయ-బెండకాయ-టమాటా పుల్లగూర, టమాటాగుజ్జు, …

పూర్తి వివరాలు
error: