కడప-సామెతలు-ఇ

కడప జిల్లా సామెతలు – ‘అ’తో మొదలయ్యేవి

‘తో మొదలయ్యే కడప జిల్లా సామెతలు

  • అందరూ బాపనోల్లే, గంప కింద కోడి ఏమైనట్లు?
  • అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని
  • అన్నీ ఉన్నెమ్మ అణిగిమణిగి ఉంటే ఏమీ లేనమ్మ ఎగిసెగిసి పడిందంట
  • అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలీనమ్మ ఏకాదశి నాడు చచ్చిందంట
  • అడక్కుండా అమ్మయినా పెట్టదు
  • అడివి పంది సేను మేసి పొతే, ఊరపంది సెవులు కోసినట్టు
  • అడివి సెట్టుకు యానాదోడు పెట్టిందే పేరు
  • అడుక్కునే వాడిని బుడుక్కునేవాడు అడిగినట్లు
  • అడ్డబొట్టోడు, నిలువుబొట్టోడు తగవులాడి సత్రం తగలబెట్టినారంట
  • అడ్డెడు వడ్లు తినేవాడికి ఆలెందుకు? ఇద్దము మోసేవానికి ఎద్దెందుకు ?
  • అడ్డెడు వడ్ల ఆశకు పొతే, తూమెడు వడ్లు దూడ తినిపోయింది
  • అత్త మింద కోపం దుత్త మింద సూపించినట్లు
  • అందని మాని పండ్లకు అర్రులు సాచినట్లు
  • అందితే జుట్టు అందకుంటే కాళ్ళు
  • అక్కర ఉన్నంత వరకు ఆదినారాయణ, అక్కర తీరినాక గూదనారాయణ
  • అక్కర గడుపుకోని, తక్కెడ పొయిలో బెట్టినట్లు
  • అగ్గువ కొననీయదు, తీవరం తిననీయదు
  • అటుకులు బొక్కే నోరు, ఆడిపోసుకుండే నోరు ఊరుకోవు
  • అప్పు లేని గంజి దోప్పెడే చాలు
  • అమ్మా పెట్టదు, అడుక్కోనివ్వదు
  • అమ్మను తిడతావేమిరా లంజాకొడకా అన్నాడంట
  • అమ్మ పుట్టిల్లు మేనమామకెరుక
  • అమ్మబోతే అడివి, కొనబోతే కొరివి
  • అయితే ఆతుకూరు లేకుంటే గదాతుకూరు
  • అయినోన్ని అడిగేదానికంటే, కానోని కాళ్ళు పట్టుకునేది మేలు
  • అయినోళ్ళు లోతుకు తీస్తే, కానివాళ్ళు మిట్టకు తీస్తారు
  • అయిదేళ్ళ ఆడపిల్లయినా, మూడేళ్ళ మొగపిల్లోనికి లోకువే
  • అయిపోయిన పెళ్ళికి మ్యాలం ఎందుకు?
  • ఆకు ముళ్ళు మీద పడినా, ముళ్ళు ఆకు మీద పడినా బొక్క ఆకుకే
  • అరచేతిలో వైకుంఠం సూపిచ్చానాడు
  • అలవికాని ఆలిని కట్టుకొని మురిగి చచ్చెరా ముండాకొడుకు
  • అలిగి అత్తవారింటికి, చెడి చెల్లెలింటికి పోరాదు
  • అరవోడు లేని దేశం, కాకి లేని ఊరూ లేవు
  • అలిగి అల్లుడు చెడితే, కుడవక కూతురు చెడిందంట
  • అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే ఎట్లా?
  • అసలుకు గతి ల్యాకుంటే కొసరు కావాలన్నాడంట
  • అసలు దేవుడు మూలబడితే, హనుమంతరాయునికి తెప్పతిరునాళ్ళంట
చదవండి :  మామరో కొండాలరెడ్డి - జానపదగీతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: