మోపూరు కాలభైరవుడు
మోహనగిరి పై నున్న మోపూరు ఆలయం

మోపూరు భైరవ క్షేత్రం – నల్లచెరువుపల్లె

వైయెస్సార్ జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్లె సమీపంలోని మోపూరు భైరవ క్షేత్రం జిల్లాలోని విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. మొహనగిరి పై మోపూరు వద్ద ఈ పుణ్యక్షేత్రం వెలిసింది. మోపూరుకు దిగువన ప్రవహించే   పెద్దేరు (గుర్రప్ప యేరు) ,  సింహద్రిపురం ప్రాంతం నుండీ పారే మొగమూరు యేరు ( చిన్నేరు ) ,  పులివెందుల ప్రాంతం నుండీ పారే  ఉద్ధండవాగు నల్లచెరువు పల్లె వద్ద మోపూరు తిప్ప వద్ద కలుస్తాయి. ఈ భైరవేశ్వర దేవాలయం త్రివేణీ సంగమ స్థానంలో ఉందని చెప్పవచ్చు.

ఈ క్షెత్రంలో 18 అడుగుల ఎత్తు, 10 అడుగుల వెడల్పు గల లింగాకారంలో భైరవేశ్వర స్వామి వెలిశాడు. ఈ భైరవెశ్వర లింగం రెండు అంతస్తుల మేర ఆవరించి ఉంది. ఇక్కడ లభించిన శాసనాధారాలను బట్టి ఈ క్షేత్రం 12 వ శతాబ్దానికి ముందు నుండే ఉందని భావించొచ్చు. ఈ క్షేత్రంలో శైవ, వైష్ణవ, శాక్తేయ మతాలకు సంబంధించిన విగ్రహాలున్నాయి. గుడి ముందు భాగాన కొంత దూరంలో కుడి పక్కన కుమారస్వామి, దుర్గాదేవి విగ్రహాలున్నాయి. ఎదురుగా బౌద్ధారామం, అమరావతి స్తూపాకారాలున్నాయి.

చదవండి :  పులివెందుల శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

ఇక్కడి గుహలో భష్మాసురుడు విభూతి పూసుకుని తపస్సు చేశారని చెబుతారు. భైరవేశ్వర లింగం పై ఉన్న గుర్తులను భష్మాసురుని చేతి గుర్తులుగా భక్తులు భావిస్తారు. భైరవేశ్వర విగ్రహం దినదిన ప్రవర్దమానమౌతుండగా స్వామి సోదరి అక్కపప్పూరమ్మ స్వామి తలపై చేతిని ఉంచి పెరుగుదలను ఆపినట్లు కూడా మరో కథ ప్రచారంలో ఉంది. దీనితో భైరవేశ్వరుడు ఆగ్రహించి అక్క పప్పూరమ్మను కొండ పై నుంచి కిందికి తోసేశాడనీ మరో కథనం ప్రచారంలో ఉంది. ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన స్వామి అక్క పప్పూరమ్మకు కొండ కింద గుడి కట్టించారట! భక్తులు తన సోదరిని దర్శించిన తర్వాతే తనను దర్శించుకోవాలని స్వామి నియమం విధించాడట ! అక్కపప్పూరమ్మకు జంతుబలులతో, భైరవేస్వరుడికి కాయా కర్పూరాలతో భక్తులు పూజలు చేస్తూ ఉండటం విశేషం!

ఆలయ చరిత్ర:

చదవండి :  కడప, పులివెందుల ఉపఎన్నికల తాజా సమాచారం

మోహనగిరి లెదా మోహన శైలంగా పిలుస్తూవుండిన ఈ ప్రాంతాని వినుకొండ వల్లభరాయలు పాలించారు. కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వరున్ని సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. ఇక్కడ అచ్యుతరాయల(శ.శ. 1452), సదాశివరాయల (1466) నాటి శాసనాలున్నాయి. ఈ క్షేత్రంలో నాయనార్లు కూడా స్వామిని సేవించినట్లు ఇక్కడ దర్శనమిచ్చే నాయనార్ల విగ్రహాలవల్ల తెలుస్తోంది.

ఈ ఆలయాని ఆంధ్ర, కర్నాటక ప్రాంతాలలో వందలాది ఎకరాల మాన్యం భూములున్నాయి. అయితే అవన్నీ ఇప్పుడు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. ఆలయానికి చెందిన అపురూపమైన శిల్పకళను స్వార్థపరులు ధ్వంసం చేశారు.

వీరపునాయుని పల్లె నుండీ పాలగిరి, రామిరెడ్డిపల్లి, ముత్తుకూరుల మీదుగా కూడా మోపూరు దెవాలయాన్ని చేరుకోవచ్చు. ఎత్తైన మోహనగిరిపై వెలసిన మోహనగిరి పై నున్న మోపూరు ఆలయం చుట్టూ 18 కిలోమీటర్ల వరకు కనిపిస్తూ భక్తుల పాలిట దివ్య క్షేత్రంగా విలసిల్లుతూ ఉంది.

ఆలయ అభివృద్ది:

స్వర్గీయ ముఖ్య మంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆలయ అభివృద్దిపై శ్రద్ద చూపడంతో కోటి రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయి. ఎత్తైన మోహనగిరిపై వెలసిన మోహనగిరి పై నున్న మోపూరు ఆలయం చుట్టూ 18 కిలోమీటర్ల వరకు కనిపిస్తూ భక్తుల పాలిట దివ్య క్షేత్రంగా విలసిల్లుతూ ఉంది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1999

మోపూరు దేవాలయ చరిత్రపై నల్లచెరువుపల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి యెల్లారెడ్డి “మోపూరు కాలభైరవుడు” అనే పేరుతో 2002 వ సంవత్సరంలో విపులమైన గ్రంధాన్ని రచించారు. అలాగే యలమర్తి మధుసూదన్ అనేరచయిత “శ్రీ శ్రీ మోపూరు  భైరవేశ్వరస్వామి చరిత్ర ” అనే గ్రంధాన్ని రచించారు.      ఎంతో విశిష్టమైన చరిత్ర గలిగిన ఈ ఆలయ అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యెక శ్రద్ధను చూపాల్సిన అవసరం ఉంది.

ఎలా వెళ్ళాలి:

దగ్గరి విమానాశ్రయం : కడప

దగ్గరి రైల్వే స్టేషన్ : యర్రగుంట్ల

బస్సులో…

పులివెందుల నుండి గోటూరు మీదుగా నల్లచెరువు పల్లె  (20 కి.మీ.)

ప్రొద్దుటూరు నుండి ఎర్రగుంట్ల , మొయిళ్ళచెరువు మీదుగా (60 కి.మీ.)

ఇదీ చదవండి!

పశుగణ పరిశోధనా కేంద్రంలో జగన్

పశుగణ పరిశోధనా కేంద్రాన్నిఉపయోగంలోకి తీసుకురండి

ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: