నాలుగోసారి పార్టీ మారనున్న కందుల సోదరులు

కడప: ప్రస్తుతం వైకాపాలో ఉన్న కందుల సోదరులు భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా వీరు భాజపా నేతలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వచ్చినట్లు మీడియాలో కధనాలు వెలువడ్డాయి. కందుల రాజమోహన్‌రెడ్డి ఆ పార్టీ ముఖ్యనేతతో భేటీ అయ్యి, చేరిక తేదీని ఖరారు చేసుకున్నట్లు సమాచారం.

జనవరి 9వ తేదీన విజయవాడకు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. ఆయన సమక్షంలో చేరేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ అది కుదరకపోతే 18వ తేదీన కడప నగరంలో నిర్వహించే బహిరంగ సభలో కాషాయ కండువా వేసుకుంటారట.

చదవండి :  'కడప జిల్లాపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు'

కడపలో జరిగే సభకు రావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు, మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాలరావు, మరో నేత కన్నా లక్ష్మీనారాయణను రాజమోహన్‌రెడ్డి ఆహ్వానించారుట.

మొత్తానికి భాజపాలో చేరితే ఒక సంవత్సర కాలంలోనే నాలుగు పార్టీలు మారిన ఘనత కందుల సోదరులకు దక్కుతుంది. వీరు ఇప్పటికే ఒక మారు తెదేపా నుండి కాంగ్రెస్ కు మారారు. అక్కడి నుండి తిరిగి తెదేపాకు వచ్చిన వీరు ఎన్నికల సమయంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. వైకాపాకు అధికారం దక్కకపోవడంతో ఇప్పుడు భాజపా వైపు చూస్తున్నట్లుగా ఉంది. మొత్తానికి వ్యాపారవేత్తల రాజకీయం ఇలాగే ఉంటుంది కాబోలు!

చదవండి :  ఏ జడ్పీటీసీ ఎవరికి?

ఇదీ చదవండి!

drinking water

తాగే నీళ్ళ కోసం 14.40 కోట్లడిగితే 1.90 కోట్లే ఇచ్చారా!

కడప: శుక్రవారం స్థానిక స్టేట్ గెస్ట్ హౌస్‌లో ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయితీరాజ్, జెడ్పీ అధికారులతో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: