వార్తలు

కడపలో కథానాయిక కాజల్‌ అగర్వాల్

ఆభరణాలను చూపిస్తున్న కాజల్ అగర్వాల్

మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ షోరూం ప్రారంభం ప్రముఖ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ ఆదివారం కడపకొచ్చారు. స్థానిక కోటిరెడ్డిసర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన మలబార్‌ గోల్డ్‌, డైమండ్‌ షోరూంను సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభించారు.  షోరూం ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కాజల్‌ను చూసేందుకు  అభిమానులు తరలివచ్చారు. షోరూంను ప్రారంభించి అక్కడ ఏర్పాటు చేసిన పలు డిజైన్ల …

పూర్తి వివరాలు

‘గంజి బువ్వ’ కథా సంపుటి ఆవిష్కరణ

'గంజిబువ్వ' కథల సంపుటి ఆవిష్కరణ

బత్తుల ప్రసాద్ వెలువరించిన కథా సంపుటి ‘గంజిబువ్వ’ ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాదులోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగింది. హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చలనచిత్రాల నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తెలంగాణా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌కు అందించారు. ఈ సంకలనంలో బత్తుల ప్రసాద్ …

పూర్తి వివరాలు

మంగంపేట ముగ్గురాయి కథ

Barytes

అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి …

పూర్తి వివరాలు

‘ఉక్కు’ నివేదిక ఏమైంది?

Steel Authority of India

కడప: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై  నవంబరు 30లోగా స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించవలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 23-07-2014 తేదీన కేంద్ర ఉక్కు, గనులశాఖమంత్రి తోమార్‌కు లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి 21-08-2014న ప్రతి లేఖ …

పూర్తి వివరాలు

రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు

ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి

ప్రముఖ సాహితీ విమర్శకులు, సాహితీవేత్త ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారు ఈ ఏడాది కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రచించిన “మన నవలలు, మన కథలు” అనే విమర్శనా గ్రంథానికి ఈ అవార్డు ఇస్తున్నట్లు శుక్రవారం కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రకటించింది. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రస్తుతం కడపలోని సి.పి.బ్రౌన్ భాషా …

పూర్తి వివరాలు

మహిళా డెయిరీల మూసివేతకు రంగం సిద్ధం?

mahila dairy

కడప జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నడుస్తున్న పాలశీతలీకరణ కేంద్రాల(బీఎంసీయూ) మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో బ్యాంకులింకేజీ, వడ్డీలేని రుణాలు తదితర కార్యక్రమాలతో పాటు బీఎంసీయూలను ఏర్పాటు చేసి మహిళలు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు వీటిని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినారు. జిల్లాలో గతంలో 32 …

పూర్తి వివరాలు

దాల్మియా గనుల తవ్వకాల నిలుపుదల

జమ్మలమడుగు సమీపంలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ

జమ్మలమడుగు: మైలవరం మండలం నావాబుపేట సమీపంలోని దాల్మియా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు. స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి గురువారం మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. …

పూర్తి వివరాలు

జనవరి1న ఒంటిమిట్టలో పోతన భాగవత పద్యార్చన

కరపత్రాలను విడుదల చేస్తున్న దృశ్యం

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి1, 2015న ఒంటిమిట్టలోని కోదండరామాలయంలో నిర్వహిస్తున్న పోతన భాగవత పద్యార్చనకు వేలాదిగా తరలిరావాల్సిందిగా 9,10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు నిర్వాహకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తితిదే కల్యాణమండపంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను తితిదే ధర్మప్రచార మండలి సభ్యులతో కలిసి పోతన సాహితీ పీఠం సభ్యులు విద్వాన్ కట్టా నరసింహులు ఆవిష్కరించి …

పూర్తి వివరాలు

జిల్లాలో 48 కరువు మండలాలు

kadapa district map

కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, …

పూర్తి వివరాలు
error: