ఖాదరాబాద్ లో ‘ప్రేమిస్తే ఇంతే’ సినిమా చిత్రీకరణ

ప్రొద్దుటూరు మండల పరిధిలోని ఖాదరాబాద్ గ్రామంలో బుధవారం ‘ప్రేమిస్తే ఇంతే’.. సినిమా షూటింగ్ జరిగింది. ఈ షూటింగ్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాకు ఖాదరాబాద్‌కు చెందిన రమేష్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రేమిస్తే ఇంతే… సినిమాలో నేటి యువత ఆకర్షణకు, ప్రలోభాలకులోనై ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటీనటులందరూ కొత్తవారేనన్నారు.

రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు. షూటింగ్‌లో హీరోయిన్‌ను విలన్ కిడ్నాప్ చేసే సన్నివేశం, పోలీసులు వచ్చి విచారించే సన్నివేశాలను చిత్రీకరించారు.

చదవండి :  కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

ఒక వ్యాఖ్య

  1. ప్రేమిస్తే ఇంతే ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: