హోమ్ » పర్యాటకం » పుష్పగిరి ఆలయాలు
పుష్పగిరి బ్రహ్మోత్సవాలు
పెన్నేటి గట్టున ఉన్న పుష్పగిరి చెన్నకేశవుని ఆలయం

పుష్పగిరి ఆలయాలు

వైష్ణవులకిది మధ్య ఆహోబిలమూ

శైవులకిది మధ్య కైలాసమూ

కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో పుష్పగిరి క్షేత్రం కొండపై ఉంది. కింద పుష్పగిరి గ్రామం ఉంది. ఇది హరిహరాదుల క్షేత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో వందకు పైగా ఆలయాలు ఉండేవన్న పురాణగాధ ప్రచారంలో ఉంది.

ఆది శంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం, విద్యారణ్యస్వామి ప్రతిష్ఠించిన శ్రీచక్రంతో దర్శనీయ క్షేత్రంగా విరాజిల్లుతున్న పుష్పగిరి క్షేత్రం కడప నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రాన్ని సందర్శించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక, దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు.

ఏకైక శంకరాచార్య మఠం

పుష్పగిరి ఆలయం ఎదురుగానే పుష్పగిరి మఠం ఉంది. ఈ క్షేత్రాన్ని వైష్ణవులు మధ్య ఆహోబిలం అనీ, శైవులు మధ్య కైలాసం అని పిలుస్తూ ఉంటారు. రాష్ట్రంలో శంకరాచార్య మఠం ఇదొక్కటే. ఈ మఠానికి ఎదురుగా త్రికూటేశ్వరాలయం ఉంది. కమలేశ్వర, హచాలేశ్వర, పల్లవేశ్వర ఆలయాలు 1255లో ప్రతిష్టించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ మూడు ఆలయాలకూ ఉమ్మడి ముఖమంటపం ఉంది.

చదవండి :  సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వైద్యనాథ ఆలయం

అలాగే, చోళ రాజుల కాలంలో నిర్మించిన వైద్యనాథ ఆలయం పశ్చిమం వైపు ముఖం కలిగి ఉంది. ఈ ఆలయం శిల్పకళా సంపదకు పేరొందింది. ఆలయం గోడలపై శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఏనుగుల వరసలు,గుర్రాల మీద వీరుల విన్యాసాల దృశ్యాలు చూడముచ్చటగా ఉంటాయి. వైద్యనాదేశ్వరుణ్ణి శైవులు, చెన్నకేశవస్వామిని వైష్ణవులు అర్చిస్తారు.

జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయాన్ని నిర్మించినట్టు పౌరాణిక గాథప్రచారంలో ఉంది. చోళులు, పల్లవులు,కృష్ణదేవరాయులు ఆ తర్వాతి కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధిపర్చారు.

చదవండి :  కడప నగరం
పుష్పగిరి ఆలయాలు
పురావస్తు శాఖ వారి ఫోటోగ్రాఫర్ 1898-99లో తీసిన పుష్పగిరి చెన్నకేశవాలయం ఫోటో

రుద్రపాదం, విష్ణుపాదం

ఇక్కడ కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం నెలకొని ఉండటం విశేషం. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాదేశ్వరుడు, కమల సంభవేశ్వరుడు, దుర్గాంబల ఆలయాలు ఉన్నాయి. రుద్రపాదం, విష్ణుపాదం ఈ కొండమీద ఉన్నాయి.

పంచనదీ క్షేత్రం

పుష్పగిరికి సమీపంలో  పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. దాంతో పుష్పగిరికి పంచనదీ క్షేత్రంగా పేరొచ్చింది.

అమృత సరోవరం

ఇక్కడ  అమృత సరోవరం ఉంది. దీనికి సంబంధించిన పురాణగాథ ప్రచారంలో ఉంది. గరుత్మంతుడు ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకుని వస్తున్నప్పుడు ఇంద్రుడు అడ్డగించగా, ఆ భాండంలోని కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగేవారికి యవ్వనం లభించేది. అమరత్వమూ సిద్ధించేది. దాంతో భయపడిన దేవతలు శివుణ్ణి ఆశ్రయించగా, ఆయన వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పంలా తేలింది. అదే పుష్పగిరి అయిందట.

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

ఎలా వెళ్ళాలి?

పవిత్ర పినాకినీ నదీ తీరంలో వెలసిన ఈ కేత్రానికి రోడ్డు మార్గంలో ఇలా వెళ్ళవచ్చు…

కడప నుంచి: చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా చేరుకోవచ్చు.

ఖాజీపేట నుంచి: చింతలపత్తూరు మీదుగా వెళ్ళేందుకు వాహనాలు అందుబాటులో ఉంటాయి.

తాడిపత్రి నుంచి: జాతీయ రహదారిపై వల్లూరు మీదుగా చేరుకోవచ్చు.

దగ్గరి రైల్వే స్టేషన్: కడప, కమలాపురం

దగ్గరి మిమానాశ్రయాలు: కడప (19 KM), తిరుపతి (159 KM), బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్

ఇదీ చదవండి!

పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

11 రోజులపాటు పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: