హోమ్ » వార్తలు » దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఈ రోజు

దేవుని కడప బ్రహ్మోత్సవాలలో ఐదోరోజు శనివారం నాటి ఉత్సవాలు…

ఉదయం కల్పవృక్ష వాహనంపై ఊరేగింపు, స్నపన తిరుమంజనం

సాయంత్రం 6గంటలకు వూంజల్‌సేవ

సాయంత్రం గరుడవాహన సేవ

నగరసంకీర్తన

ఉత్సవాలలో భాగంగా నగరంలోని ప్రధాన పురపాలక ఉన్నత పాఠశాల వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి అభిషేకోత్సవం, అలంకరణ ఉంటుందని రుక్మిణి పాండురంగ భజన బృందం తెలిపింది. అనంతరం స్వామి గరుడసేవలో పాల్గొనే భక్తులకు అన్నదానం చేయనున్నట్లు కమిటీ పేర్కొంది.

సాయంత్రం నాలుగు గంటలకు భజన బృందంతో అన్నమయ్య విగ్రహం నుంచి దేవుని కడప వరకు నగరసంకీర్తన ఉంటుందని చెపారు.

శోభాయాత్ర

తిరుచానూరు నుంచి లక్ష్మీహారం శనివారం ఉత్సవాల అలంకరణకు రానుందని ఆలయ ఈవో ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కృష్ణాథియేటర్‌నుంచి దేవుని కడప వరకు లక్ష్మీహారాన్ని వూరేగింపుగా శోభాయాత్ర చేస్తామన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు హారాన్ని తీసుకుని భారీ వూరేగింపుతో ఆలయానికి తెస్తామన్నారు. శనివారం అలంకరణలో అమ్మవారి హారాన్ని చేర్చనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి!

కన్నుల మొక్కేము

కన్నుల మొక్కేము నీకుఁ గడపరాయ – అన్నమయ్య సంకీర్తన

పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. వాని అందచందాలు చూసి కన్నెలు పరవశించినారు. వాని చేతలకు బానిసలైనారు. కడపరాయని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: