హోమ్ » వార్తలు » యోగివేమన విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నూతన ఉపకులపతిగా ఆచార్య డా. బి. శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పలు కీలకపదవులు నిర్వహించారు.

ఆరునెలలుగా ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్ పదవికి పలువురు పోటీపడ్డారు. ఆచార్య శ్యాంసుందర్ నియామకానికే గవర్నర్ మొగ్గుచూపడంతో వైవీయూ మూడో వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు.

చదవండి :  తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు

ఆచార్య శ్యామ్‌సుందర్‌ నాగార్జున విశ్వవిద్యాలయంలో 1982లో అధ్యాపకులుగా ప్రవేశించారు. 1985 నుంచి 1994 వరకు రీడర్‌గా ఆ తర్వాత ఆచార్యులుగా నియమితులై 2012 ఏప్రిల్‌ 30 వరకు వివిధ హోదాల్లో కొనసాగారు.

ప్రణాళిక, పర్యవేక్షణ సంఘం సభ్యుడిగా, స్పేస్‌ కమిటీ, అకడమిక్‌ సెనేట్‌, కోడ్‌ ప్రిపరేషన్‌, మెడికల్‌ అడ్వయిజరీ బోర్డు సభ్యుడిగా, సీఎస్‌ఐఆర్‌, యూజీసీ నెట్‌ సమన్వయకర్తగా, ఫార్మాష్యూటికల్‌ రీసెర్చి అండ్‌ టెక్నాలజీ జర్నల్‌ ఎడిటరుగా, ఫిజికల్‌ సైన్సు జర్నల్‌ చీఫ్‌ ఎడిటరుగా, ఎన్‌యూసీఈటీ-2002 కన్వీనరుగా, యాన్యువల్‌ కన్వెన్షన్‌ కన్వీనరు, ఎగ్జామినరుగా, పీజీ కోర్సుల ప్రధాన బాధ్యులుగా, రీసెర్చ్‌ స్కాలర్ల సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శిగా, విద్యార్థి సమాఖ్య ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా, పలు దఫాలు విచారణ అధికారిగా, బోర్డు ఆఫ్‌ స్టడీస్‌, ఎగ్జామినేషన్సు, ఇన్‌స్టిట్యూషనల్‌ ఎథికల్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా. గౌరవ పరిశోధక సంచాలకులుగా, కృష్ణదేవరాయ, విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఛాన్స్‌లర్‌ నామినీగా, ఫిజికల్‌ సైన్సు డీన్‌గా పలు కీలకమైన పదవులను నిర్వహించారు.

చదవండి :  ఏప్రిల్ 2 నుంచి యోవేవి డిగ్రీ పరీక్షలు

కాలేజ్‌ ఆఫ్‌ సైన్సుకు 2010-11లో ప్రధానాచార్యులగా పనిచేశారు. ఫార్మాష్యూటికల్‌ సైన్స్‌ కళాశాలకు 2010 జనవరి నుంచి 2011 మే వరకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. అంతర్జాతీయ ఫ్రెండ్‌షిప్‌ సొసైటీ-2008లో శిక్షారతన్‌ పురస్కారం, హూ ఈజ్‌ హూ బుక్‌ 2009 గుర్తింపు, విదేశాల పలు ప్రొఫెషనల్‌ బాడీస్‌, సైంటిస్టు సంస్థలకు ఫెలోగా, ఛార్టెడ్‌ కెమిస్ట్‌గా, శాస్త్రవేత్త ఇన్‌ఛార్జిగా, కౌన్సెల్‌ సభ్యుడిగా పదవులను నిర్వహించారు. డాక్టరు శ్యామ్‌సుందర్‌ వద్ద 19 మంది పీహెచ్‌డీలు అందుకున్నారు.

చదవండి :  పాఠశాల ఆవరణలో 5 మృతదేహాలు

ఇదీ చదవండి!

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయ బంద్

యోవేవి పాలకుల తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం విశ్వవిద్యాలయ బంద్‌కు పిలుపునిచ్చినట్లు రాయలసీమ విద్యార్థి వేదిక కోకన్వీనరు దస్తగిరి, ప్రతినిధి నాగార్జున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: