హోమ్ » Event » పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు

పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : http://www.kadapa.info/జీవో120/

 

ఇదీ చదవండి!

బినామీ కంపెనీ

బినామీ కంపెనీ (బ్రాహ్మణి) ఆరోపణల గురించి (02 April 2008)

బ్రాహ్మణిని తన బినామీ కంపెనీగా పేర్కొంటూ తెలుగుదేశం తరపున ఆనాటి విపక్షనేత చంద్రబాబు శాసనసభలో చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి వైఎస్ ఇచ్చిన సమాధానం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.