హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే (http://www.thehindu.com/news/cities/Vijayawada/electronic-warfare-lab-in-kadapa-district/article6398329.ece) ఆది నుంచి జిల్లా విషయంలో వివక్ష చూపుతున్న తెదేపా ప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా కర్నూలులో భూమి ఇస్తామని ప్రతిపాదించింది. ఫలితంగా 10వేల కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు కావలసిన ప్రాజెక్టు కడప జిల్లాకు దక్కకుండా పోయింది. (http://www.thehindu.com/news/national/andhra-pradesh/drdo-directors-inspect-missile-research-lab-sites/article7400988.ece)

రాజకీయ నాయకుల మద్దతు లేకపోయినా ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబ్ కడప జిల్లాలోనే ఏర్పాటు చెయ్యాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖకు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి వెంకయ్యనాయుడు గారికీ, DRDO వారికీ కడప జిల్లా ప్రజలు వినతి పత్రాలు (http://wp.me/p4r10f-1ow) పంపినా వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు.

చదవండి :  కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

15 నవంబరు 2014న సమాచార హక్కు చట్టం కింద ఇదే విషయమై వివరాలు అడిగితే వచ్చిన సమాధానం ఇది: “You are hereby informed that DRDO is placed in Second Schedule of RTI Act, 2005 and is exempted from disclosures of information under section 24(1) except to the allegations of corruption and human rights violations.”

ఇంతకు ముందు ఉర్దూ విశ్వవిద్యాలయం విషయంలోనూ ఇలాంటి ధోరణినే కనబరిచిన రాష్ట్ర ప్రభుత్వం కడప జిల్లా పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి గండి కొడుతోంది.

చదవండి :  ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాల

ఇంతా జరిగినా మన అధికార పక్ష నేతలు కానీ, విపక్ష నేతలు గానీ ఈ విషయాల మీద మాట్లాడటం లేదెందుకో? వీళ్ళు ప్రభుత్వానికి ఇంత అనుకూలంగా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇటువైపు ఎందుకు చూస్తుంది.

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: