జిల్లాకు గేట్ 2014 పరీక్షా కేంద్రం

కడప: ఈ సంవత్సరం  ఫిబ్రవరి – మార్చి నెలల్లో నిర్వహించే ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి గేట్-2014కు కడప జిల్లాకు పరీక్షా కేంద్రం మంజూరైంది. ఆన్ లైన్ పద్ధతిలో నిర్వహించనున్న గేట్-2014 పరీక్షా కేంద్రం జిల్లాకు మంజూరు కావడంతో ఇక్కడి విద్యార్థులు తిరుపతి లేదా ఇతర నగరాలకు వెళ్ళవలసిన బాధ తప్పింది.దీనికి సంబంధించి ఇటీవల టిసిఎస్ సంస్థ ప్రతినిధులు ఐఐటి మద్రాసు తరపున ఆన్ లైన్ పరీక్ష కేంద్రం ఎంపిక కోసం  మూడు నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలను పరిశీలించి వెళ్లారు. పరీక్షా కేంద్రాలుగా ఎంపిక చేసిన కళాశాలలకు ఐఐటి మద్రాసు ఇప్పటికే సమాచారం అందించింది .

చదవండి :  గాలివీడు వద్ద సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదన కేంద్రం

రాజంపేట అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలను ఆన్‌లైన్ కేంద్రంగా ఎంపిక చేసినట్లు తమకు సమాచారం అందిందని  కళాశాల గౌరవ కార్యదర్శి చొప్పాగంగిరెడ్డి, ఈడీ చొప్పా అభిషేక్‌రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ జి.ప్రభాకర్‌రావు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: