నవోదయ ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31

రాజంపేట మండలం నారంరాజుపల్లెలోని జవహార్ నవోదయ విద్యాలయంలో 2014-2015 విద్యాసంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశానికి బాలబాలికలు అక్టోబర్ 31వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కె.వి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

2013-2014 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వతరగతి చదువుతూ 02.05.2001 నుంచి 30.04.2005 మధ్య జన్మించిన బాలబాలికలు  నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వివరించారు.

దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు 08.02.2014 వతేదీ శనివారం నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.  ఈ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా నవోదయ పాఠశాలలో ప్రవేశం కల్పిస్తారు.

చదవండి :  జూన్ 1కి వాయిదా పడ్డ యో.వే.వి ఇన్ స్టంట్ పరీక్షలు

 

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: