బుంగ ఖరీదివ్వరా

బుంగ ఖరీదివ్వరా పిల్లడ – జానపదగీతం

అందమైన ఆ పల్లె పిల్ల ఆకు వేసి, తమ్మ పుక్కిట పెట్టి చెంగావి రంగు సీర కట్టుకొని బుంగ తీసుకుని ఒయ్యారంగా నడుస్తూ నీటి కోసం ఏటికి వచ్చింది. ఏటి దగ్గర ఒక కొంటె కోనంగి సరదాపడి రాయి విసిరినాడు. ఆ రాయి గురి తప్పి ఆ గడుసు పిల్ల కడవకు తగిలి అది పగిలిపోయింది. ఆ పిల్ల రాయి విసిరిన పిల్లగాడిని నిలేసి ఇలా అడుగుతోంది…

వర్గం: యాలపాట

చదవండి :  నా కొడకా నాగయో.... జానపదగీతం

పాడటానికి అనువైన రాగం: ఆనందభైరవి స్వరాలు (ఏకతాళం)

బుంగ ఖరీదివ్వరా పిల్లడ
నాబుంగ ఖరీదివ్వరా

బుంగ ఖరీదిచ్చి పోకుంటే – నిన్నొక్క
అంగైన సాగనీయరా ఓ పిల్లడ !!బుంగ !!

బుంగ భుజాన పెట్టి
పుక్కీలు తమ్మబెట్టి
చెంగావి సీర కట్టి
సెయ్యి రొండీన బెట్టి !!బుంగ !!

రింగు రింగు మనునట్టి
రంగు పిల్లెండ్లు బెట్టి
కొంగు జీరాడేగ – కులుకుచు వీధివెంట
వంగి వంగి నీరుతెత్తురా – పిల్లడ
నా బుంగ ఖరీదివ్వరా
ఓ పిల్లడ నాబుంగ ఖరీదివ్వరా

చదవండి :  మామరో కొండాలరెడ్డి - జానపదగీతం

రంగూల మారిబుంగ
రాయి వంటి కొత్తబుంగ
సేతికింపైన బుంగ
సుంగారమయిన బుంగ
కంగూన పలుకు బుంగ
కావీ రంగుల బుంగ
సక్కదనాల బుంగ
సంకానొదిగేటిబుంగ !!సక్కదనాల !!
బుంగంటె బుంగ కాదురా – పిల్లడ
నాబుంగ ఖరీదివ్వరా
బుంగ ఖరీదివ్వరా ఓ పిల్లడ… నాబుంగ ఖరీదివ్వరా

బంకమట్టి పంబదూది
రాయి ఇసుక తుమ్మబొగ్గు!!బంక !!
పొం కాముగ నూరి
కుమ్మారి యంకట
దాసు చేసినట్టి బుంగరా – పిల్లడ
నా బుంగ ఖరీదివ్వర

చదవండి :  శివశివ మూరితివి గణనాతా - భజన పాట

పాటను సేకరించినవారు: కీ.శే కలిమిశెట్టి మునెయ్య

ఇదీ చదవండి!

అందమైన దాన

ఏమే రంగన పిల్లా – జానపదగీతం

ఒక పడుచు పిల్లగాడు తన అందమైన పడుచు పెళ్ళాన్ని విడిచి వ్యాపారం కోసం పరాయిదేశం పోయినాడు. వాడు చెప్పిన సమయానికి …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: