వాల్మీకి మహాముని ఆశ్రమం అని చెప్పుకోబడిన స్తలమందు వనిపెంట

రాయించినది: కుల్కరిణీ శంకరప్ప

నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు…

ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను  కొట్టాలు వేసుకుని ఈ అరణ్యము మధ్య ఉండిరి. మరికొన్నాళ్ళు జరిగిన తరువాత ఆ నర్ర గొల్లలు వేసుకున్న కొట్టాల దగ్గర నర్ర ఆవులను ఆంచిన స్తలములో పెంట (ఎరువు) అంటా పెద్ద గుట్టలుగా తోసి ఉండేది. కనుక ఇక్కడ కొట్టాలు వేసిన స్తలానికి పేరు ‘వనం పెంట’ అని చెప్పుకునేవారు. తరువాత ‘వనిపెంట’ అనే పేరుగా, జనుల చేత వాడుకోబడి వఖ కొండపల్లె అయి ఉండేది.

చదవండి :  సిద్ధవటం కోమట్లు స్థాపించిన 'శెట్టిగుంట'

తరువాత ఈ స్థలానికి కొండగములు చేసే వాళ్ళు వచ్చి, ఇక్కడ ఉన్న గొల్లల చేతనే పనులు చేయించి వీళ్ళకు మజూరీలు ఇస్తూ… ఈ పల్లెకు పూర్వ భాగామందున వజ్రాల గనులు తవ్వించిరి.  అందుచేత  చుట్టుపట్టున ఉండే ప్రాచీన స్తలాలకు ఈ పల్లె వాడిక పడినందున, ప్రజలు చేరి అరణ్యము చదును చేసి ఫలపర్చారు.  ఇది కొండల మధ్య స్థలం అయినందున నీరు జవుకు (ఊట) పట్టి,  భూమి యిమక తీసి ఎండిపోకుండా వుంటూ వచ్చినందున సస్వాదులు బాగా ఫలించేవి. గనుక (కనుక) ఈ పల్లె చుట్టుపట్టున స్తలమందు అడవి నరికి ప్రజలు పొలం యేర్పరించుకుని, గ్రామానికి రెడ్లు, కరణీల్కు నిర్నయించుకునిరి. గ్రామం రూపు చేసుకున్న తరువాత అప్పుడు రాజ్యం యేలుతూ వుండేటి చోళ మహారాజు దగ్గరకు రెడ్లు, కరణీలు పోయి భేటీ అయి… ‘నల్లమల సామీప్యమందు పూర్వమున వాల్మీకి మహాముని ఆశ్రమం అని చెప్పుకోబడిన స్తలమందు గ్రామం రూపు చేసినాము, చిత్తాన కౌలు పా()లిస్తే అరణ్యం ఇంకా నరికి పొలం చేస్తుం.’ అని చెప్పుకున్నారు.

చదవండి :  మేడిదిన్నె కైఫియత్

అదే ప్రకారం రాజు వారు వచ్చి గ్రామం చూచి.. గ్రామానికి కౌలు ఇచ్చి – అలాగే పల్లెకు పూర్వ భాగాన వాల్మీకి ప్రతిష్ఠ చేసిన ఈశ్వర లింగము, స్వల్పమయిన శిలా మండపము వుండగా.. ఆ దేవాలయము కట్టించమని శలవు పాలించిరి. గన్కు (కనుక)  ఆ ప్రకారం గ్రామస్తులు దేవాలయం కట్టించిరి.

ఈ ప్రకారము గ్రామము ఏర్పాటు అయిన తరువాత…

ప్రతాపరుద్ర మహారాజుల వారి యేలుబడికి పూర్వము,  జయనీ రాజుల (జయనులు మల్లరాయుల వారి యేలుబడిలో) యేలుబడిలో… ఈ గ్రామం కింద, గ్రామస్తుల వల్ల ఏర్పాటు (రూపు) అయిన మజరా పల్లెలు…

చదవండి :  “.. తెలుగు లెస్స ”అన్నది " మోపూరు " వల్లభరాయలే!

తిప్పిరెడ్డిపల్లె, ముద్దిరెడ్డిపల్లె, అద్దిరెడ్డిపల్లె, తాతిరెడ్డిపల్లె, పప్పనపల్లె, మిట్ట భూపన పల్లె, విశ్వనాధపురం .

ఈ పల్లెలుతో కూడుకుని గ్రామం బస్తీ అయిన తరువాత ప్రతాపరుద్రా దేవ మహారాజుల ఏలుబడిలో గ్రామం వారు (ప్రజలు) గ్రామానికి పూర్వ భాగాన, సామీప్యమందు… చెన్నకేశ్వర (చెన్నకేశవ+ఈశ్వర) దేవాలయం కట్టించిరి.

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: