హోమ్ » ఆచార వ్యవహారాలు » పులివెందులలో కొత్త సీఎస్ఐ చర్చి ప్రారంభం
csi church

పులివెందులలో కొత్త సీఎస్ఐ చర్చి ప్రారంభం

పులివెందుల: పట్టణంలో రూ.3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త సీఎస్ఐ చర్చిని గురువారం రాయలసీమ బిషప్ బీడీ ప్రసాద్‌రావు, మోడరేటర్, మోస్టు రెవరెండ్ దైవ ఆశీర్వాదం తదితరులు ప్రారంభించారు. అంతకుముందు భక్తులు, వివిధ ప్రాంతాల చర్చిల ఫాదర్లు స్థానిక ఆర్అండ్‌బీ అతిధి గృహం సమీప నుంచి ర్యాలీగా చర్చికి చేరుకున్నారు.

చర్చి ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా మారింది. చర్చి ప్రారంభం సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కూటమి నిర్వహించారు. బిషప్ బీడీ ప్రసాదరావు ప్రభువు సందేశాన్ని వినిపించారు.

చదవండి :  చంద్రప్రభ వాహనంపై వూరేగిన కడపరాయడు

ప్రతిపక్షనేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి, తన సతీమణి భారతి, తల్లి విజయమ్మలతో పాటు ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్. వివేకానందరెడ్డి, వైఎస్ కుటుంబసభ్యులు, వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాధరెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఇదీ చదవండి!

పులివెందుల రంగనాథ స్వామి

పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము – లగిసెట్టి వెంకటరమణయ్య

పుస్తకం : పులివెందుల రంగనాథ స్వామి వారి చరిత్రము ,  రచన: లగిసెట్టి వెంకటరమణయ్య,  ప్రచురణ : 1929లో ప్రచురితం.  …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: