‘పోలి’ గ్రామ చరిత్ర

జిల్లా చరిత్ర పుటల్లో పోలి గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. రాజంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఓ స్త్రీ (పోలి) తన బిడ్డను త్యాగం చేసి యజమాని వంశాన్ని నిలబెడితే, మరో స్త్రీ(సగలక్క) ఆత్మబలిదానం చేసుకుని పోలి గ్రామస్తులను కాపాడింది. ఇదంతా 11వ శతాబ్దం నాటి యథార్థ గాథ అని, ఈ వివరాలన్నీ కడప కైఫీయత్తుల్లో వెలుగు చూశాయని చరిత్రకారులు అంటున్నారు.

రాజంపేట పట్టణ పరిధిలో ఉన్న పోలి గ్రామానికి సంబంధించి ఇక్కడ ప్రచారంలో ఉన్న కథ ఇదీ..

చదవండి :  నోరెత్తని మేధావులు

11వ శతాబ్దంలో రామ్‌నగర్ గుట్టపై కాటంరెడ్డి కుటుంబం పెద్ద మహల్‌లో నివాసం ఉండేది. ఉడుమూరు, కొండూరు గ్రామాల మధ్య గొడవలు జరిగా యి. ఈ ఘర్షణలో కాటంరెడ్డి చనిపోయాడు. శత్రువు లు ఇతని మహల్‌ను ఆక్రమించారు.

అప్పుడు కాటంరెడ్డి కుమారున్ని కాపాడేందుకు వారి మహల్‌లో పని చేస్తున్న వంటమనిషి ‘పోలి’ తన కొడుకును ఆయన కొడుకుగా చూపించింది. దీంతో ప్రత్యర్థులు ఆమె కొడుకును చంపేశారు. తన బిడ్డను కోల్పోయినందుకు పోలి బాధపడలేదు. యజమాని కాటంరెడ్డి తనయుడు వెంకటరెడ్డిని పెంచి పెద్ద చేసి మేనమామలకు అప్పగిం చింది.

చదవండి :  మేడిదిన్నె కైఫియత్

ఆ నాడు జరిగిన గొడవల్లో కాటంరెడ్డి కుటుంబం సర్వం కోల్పోయింది. అయితే వారి మహల్‌లో వెంకటరెడ్డికి నిధి దొరికింది. దీంతో అతను తనను పెంచిన తల్లి పోలి పేరుతో గ్రామం ఏర్పాటు చేశాడు.

 ప్రాణాలు కాపాడిన సగలక్క

ఈ గ్రామానికి ఆనుకుని పెద్ద చెరువు ఉంది.

అది వర్షాకాలం …

ఆ రోజు పెద్దగా వర్షం కురుస్తోంది …

అందరూ ఇళ్లలో భయంభయంగా ఉన్నారు. పైన ఉన్న చెరువు నీటితో నిండిపోయింది. ఆ చెరువు కట్టకు చిన్న రంధ్రం పడింది. అది అంతకంతకూ పెరిగి పెద్దదవుతోంది. కాసేపుంటే కట్ట తెగి పోలి గ్రామం మొత్తం మునిగి పోయేది.

చదవండి :  కడప లేదా కర్నూలులో రాజధాని ఏర్పాటు చెయ్యాలి

ఆ సమయంలో కాటంరెడ్డి పెద్ద కుమార్తె సగలక్క చెరువు కట్ట వద్దకు వెళ్లింది. కట్టకు పడిన రంధ్రంలోకి తను దూరి బలిదానం చేసుకుని చెరువుకు గండిపడకుండా కాపాడింది. అప్పటి నుంచీ సగలక్కను పోలి గ్రామస్తులు తమ దేవతగా భావించి పూజిస్తున్నారు. ఆమె చెరువుకోసం బలిదానం చేసినట్టు ఇప్పటికీ ఇక్కడ శాసనాలున్నాయి.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

2 వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: