వార్తలు

బిందు సేద్యం చేయండి: చంద్రబాబు

బిందు సేద్యం

ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్  నిర్మాణానికి శంకుస్థాపన కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి  చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు. తర్వాత రామాపురం …

పూర్తి వివరాలు

చంద్రబాబు చెప్పిందే మళ్ళీ చెప్పారు

chndrababu

కడప: ఒంటిమిట్ట కోదండరాముడి కళ్యాణోత్సవంలో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం జిల్లాలో వివిధ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.ముందుగా కడప నగరంలో కొత్త సచివాలయ భవనాన్ని (కలెక్టరేట్) ఆయన ప్రారంభించారు. అనంతరం ఒంటిమిట్ట సమీపంలో రూ.34కోట్లతో నిర్మించిన శ్రీరామ ఎత్తిపోతల పథకం పైలాన్‌ను రాత్రి ఆవిష్కరించారు. కలెక్టరేట్ ప్రారంభించిన సందర్భంగా …

పూర్తి వివరాలు

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణ వైభోగం

ఒంటిమిట్ట కల్యాణోత్సవం

ఒంటిమిట్ట: కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు (బుధవారం) ప్రత్యేక వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హస్తా నక్షత్రయుక్త శుభలగ్నంలో రాత్రి 8 గంటలకు మొదలైన కల్యాణం 10 గంటల వరకూ సాగింది. ఉత్సవ విగ్రహాలను పల్లకీపై కొలువుదీర్చి ప్రధాన ఆలయం …

పూర్తి వివరాలు

సిద్దేశ్వరం కడితే సీమకు సాగునీటి కొరత ఉండదు

సీమపై వివక్ష

కడప : రాయలసీమ దాహార్తిని తీర్చడానికి తగినంత నీటిని పోతిరెడ్డిపాడు వద్ద నిలువ చేసుకునే అవకాశం సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ద్వారా సాధ్యమవుతుందని రాయలసీమ సాగునీటి సాధన సమితి ఛైర్మన్‌ బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ‘సిద్ధేశ్వరం అలుగు మనమే నిర్మించుకుందాం’ అన్న అంశంపై సోమవారం కడపలోని వైఎస్సార్‌ పాత్రికేయ సమావేశ మందిరంలో జరిగిన …

పూర్తి వివరాలు

అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

devuni kadapa

కడప: ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుని దర్శనానికి ముస్లింలు పెద్ద సంఖ్యలో భక్తులతో కలిసి తరలివచ్చారు. ఉదయం 5 గంటల నుంచే స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కొబ్బరి కాయలు కొట్టి కానుకలు సమర్పించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించి లడ్డూలను కొనుగోలు చేశారు. బీబీ నాంచారమ్మను తాము …

పూర్తి వివరాలు

మే 3 నుండి కడప – విజయవాడల నడుమ విమాన సర్వీసు

కడప - చెన్నై

వారానికి మూడు రోజులు…మంగళ, బుధ, గురు వారాలలో టికెట్ ధర రూ.1665 కడప: కడప – విజయవాడ నగరాల మధ్య వారానికి మూడు సార్లు విమానాన్ని నడిపేందుకు ట్రూజెట్ విమానయాన సంస్థ సిద్ధమైంది. మొదటి విమానం మే 3వ తేదీ మధ్యాహ్నం  1 గంట 35 నిముషాలకు విజయవాడ నుండి బయలుదేరి మధ్యాహ్నం …

పూర్తి వివరాలు

కడప.ఇన్ఫో పేరుతో విషం చల్లుతున్నామా?

www.kadapa.info

ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ కిందట 2006లో కడప.ఇన్ఫో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో కడప.ఇన్ఫోలో కొన్ని వ్యాసాలను/అభిప్రాయాలను ప్రచురించిన నేపధ్యంలో వివిధ అంశాల మీద కొంతమంది వీక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ స్పందించారు.ముఖ్యంగా మూడు రకాలైన ప్రశ్నలను/ఆరోపణలను విజ్ఞులైన వీక్షకులు లేవనెత్తారు. అందులో మొదటిది ముఖ్యంగా రాయలసీమకు/కడప జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపైన ప్రచురించిన …

పూర్తి వివరాలు

మూడు రోజులు కాదు వారానికి నాలుగు రోజులు

కడప - చెన్నై

కడప – హైదరాబాదు ట్రూ జెట్ విమాన సర్వీసు ముందస్తుగా బుక్ చేసుకుంటే టికెట్ ధర రూ.1665 కడప: కడప -హైదరాబాదుల మధ్య ప్రారంభం కానున్న ట్రూజెట్  విమాన సర్వీసు (Flight Number: 2T305) వారంలో నాలుగు సార్లు నడవనుంది. ప్రతి శుక్ర,శని,ఆది,సోమ వారాలలో హైదరాబాదు – కడపల మధ్య ఈ విమాన …

పూర్తి వివరాలు

అధికారిని తిట్టిన తెదేపా నేత లింగారెడ్డి

కడప: ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలే దు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఎవరనుకున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి’’ అంటూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వైఎస్సార్ జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) జి.వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన …

పూర్తి వివరాలు
error: