వార్తలు

సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

వైకాపా-లోక్‌సభ

ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన …

పూర్తి వివరాలు

అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

annamayya vardhanthi

సంకీర్తనాచార్యులు అన్నమయ్య 511వ వర్థంతి ఉత్సవాలు గురువారం ఆయన జన్మస్థలి తాళ్లపాక గ్రామం (రాజంపేట మండలం)లో తితిదే ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య ధ్యానమందిరంలో గోష్టి గానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అన్నమయ్య చిత్రపటాన్ని గ్రామ పురవీధుల్లో వూరేగించారు. అంతకు ముందు అన్నమయ్య మూలవిరాట్ వద్ద గ్రామపెద్దలు, …

పూర్తి వివరాలు

బాబు పాలనలో ప్రజలకు ఇక్కట్లు

ysrcp

తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. నాటి పాలనలో విసిగిపోయే వైఎస్‌కు అధికారం అప్పగించి.. ఎన్నో మేళ్లు పొందారని ఆమె కడపలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివరించారు. వివిధ కూడళ్లలో ఆమె రోడ్‌షోలు నిర్వహించారు. బిల్టప్, రామకృష్ణ పాఠశాల కూడలి, …

పూర్తి వివరాలు

ఎండాకాలమొచ్చింది!

temparature

గాలిలో తేమ శాతం క్రమేపీ తగ్గుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. శనివారం కడపలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు తెలియచేస్తున్నాయి. మార్చి ఒకటవ తేదీ నుండి జిల్లావ్యాప్తంగా క్రమేపీ  ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చిర్చి ౩1వ …

పూర్తి వివరాలు

5వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఎప్రిల్ 2 చివరి తేదీ

aprschool

కడప జిల్లాలో నడపబడుతున్న ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో(ఇంగ్లీషు మీడియం కొరకు)  చేరడానికి  నిర్వహించే ప్రవేశపరీక్షకు ఆం.ప్ర గురుకుల విద్యాలయాల సంస్థ  విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కడప జిల్లా విద్యార్థులు (బాల బాలికలు) క్రింది పాఠశాలలో ప్రవేశం పొందేందుకు అర్హులు: జనరల్ కేటగిరీ విద్యార్థులు: ఆం.ప్ర ప్రభుత్వ బాలుర గురుకుల పాఠశాల – ముక్కావారిపల్లె ఆం.ప్ర …

పూర్తి వివరాలు

ఏప్రిల్ 2 నుంచి యోవేవి డిగ్రీ పరీక్షలు

యోగి వేమన విశ్వవిద్యాలయంపై

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి మే ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఆదేశాల మేరకు ఈ తేదీలు నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూలును విశ్వవిద్యాలయ …

పూర్తి వివరాలు

గోడ దూకిన వీరశివారెడ్డి

Veerasiva reddy

కడప: జైసమైక్యాంధ్ర పార్టీలో చేరుతారని భావించిన కమలాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెదేపాలో చేరుతున్నట్లు ఈ రోజు ప్రొద్దుటూరులో ప్రకటించారు. రాష్ట్రం విడిపోవడానికి ప్రధాన కారకుడు జగన్‌మోహన్‌రెడ్డి అయితే…సీమాంధ్రను స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని వీరశివారెడ్డి ఈ సందర్భంగా అన్నారు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో అధికారంలోకి తెచ్చిన …

పూర్తి వివరాలు

బుగ్గవంక

బుగ్గవంక ప్రాజెక్టు

అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది. 500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు …

పూర్తి వివరాలు

కడప బరిలో తెదేపా అభ్యర్థిగా డిఎల్

dl

తాను రాజకీయాల్లో కొనసాగాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు కాబట్టే.. వారి ఆకాంక్ష మేరకు రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెస్ మాజీ మంత్రి, మైదుకూరు శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి వెల్లడించారు. మైదుకూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పుట్టా సుధాకర్‌యాదవ్, తెదేపా కడప పార్లమెంట్ అభ్యర్థిగా తాను ఎన్నికల గోదాలోకి దిగనున్నట్లు ఆయన ప్రకటించారు. …

పూర్తి వివరాలు
error: