హోమ్ » వార్తలు » ప్రత్యేక వార్తలు » కడప విమానాశ్రయం నుండి ప్రయాణీకుల రాకపోకలు 2015
కడప విమానాశ్రయం నుండి

కడప విమానాశ్రయం నుండి ప్రయాణీకుల రాకపోకలు 2015

31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు

మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును నడిపింది. 2015లో 31 రోజుల పాటు కడప – బెంగుళూరు విమాన సర్వీసు నడిచింది. 2015 సంవత్సరానికి గాను కడప విమానాశ్రయంలో ప్రయాణీకుల ఆక్యుపెన్సీ రేషియో 47 శాతం (scheduled Flights), 65 శాతంగా (Non Scheduled Flights, Departure Only) నమోదైంది. Scheduled Flights అంటే ముందస్తుగా అంగీకరించిన సమయం ప్రకారం నడిచే విమాన సర్వీసులు (ఉదా.. కడప – బెంగుళూరు విమాన సర్వీసు), Non Scheduled Flights అనగా చంద్రబాబు లాంటి వారు వేసుకొచ్చే ప్రత్యేక విమానాలు మొదలైనవి ఇలాంటి జాబితాలోకి వస్తాయి.

చదవండి :  నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు

2015 సంవత్సరానికి గాను మొత్తం 31 రోజులు కడప – బెంగుళూరు విమాన సర్వీసును నడిపిన ఎయిర్ పెగాసస్ నిర్వహణా కష్టాల (Operational Difficulties) పేరు చెప్పి 01-09-2015 నుండి 31-10-2015 వరకు విమాన సర్వీసును రద్దు చేసింది. ఈ మేరకు సంబంధిత విమానాశ్రయ అధికారులకు  ఎయిర్ పెగాసస్ సమాచారమిచ్చింది.

అనంతరం ఏఏఐ (ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా)కి గానీ డిజిసిఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్)కి గానీ కడప – బెంగుళూరు విమాన సర్వీసు కొనసాగించే విషయంలో ఎటువంటి సమాచారమూ ఇవ్వకుండా పూర్తిగా రద్దు చేసింది.

చదవండి :  బ్రహ్మంగారిమఠంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

కడప విమానాశ్రయం నుండి రోజువారీగా రాకపోకలు సాగించిన ప్రయాణీకుల సంఖ్య (Air Passenger Traffic, Scheduled Flights) దిగువన ఇస్తున్నాం.

కడప విమానాశ్రయం నుండి

ఇదీ చదవండి!

కడప - చెన్నై

కడప, హైదరాబాదుల నడుమ ట్రూజెట్ విమాన సర్వీసు

ఏప్రిల్ 8 నుండిప్రారంభం శుక్ర, శని, ఆది వారాలలో కడప – హైదరాబాదు సర్వీసు కడప: కడప – హైదరాబాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: