హోమ్ » చరిత్ర » కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు…

తేదీ: 1 సెప్టెంబర్ 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో కరువు పైన ఏరియల్ సర్వే  ప్రదేశం: కంచరపల్లి, రాయచోటి మండలం

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • గన్‌ల సంస్కృతి రాజ్యమేలిన ఈ ప్రాంతంలో రెయిన్‌గన్‌లతో కరవుపై పోరాటం చేస్తున్నా
  • సీమ నడిబొడ్డుగా ఉన్న రాయచోటిలో కరవు పారదోలేందుకు నా వంతు ప్రయత్నిస్తా
  • రాయలసీమను భవిష్యత్తులో కరవు రహిత ప్రాంతంగా తయారు చేస్తా
  • శ్రీశైలం జలాలను వెలిగోడు, బ్రహ్మంసాగర్‌కు చేర్చి ఆయకట్టు సస్యశ్యామలం చేస్తా
  • గండికోట, తెలుగుగంగలో అడ్డంకులను తొలగిస్తా

తేదీ: 7 మే 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ఉద్యాన రైతులకు రుణ ఉపశమన పత్రాల పంపిణీ, ప్రదేశం:  మున్సిపల్‌ మైదానం, కడప

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • కడప జిల్లాను టూరిజం, హర్టికల్చర్ హబ్ గా తయారు చేస్తా
  • బిందు సేద్యాన్ని ప్రొత్సహించేందుకు కడప జిల్లాకు అనంతపురం జిల్లా మాదిరి 90శాతం సబ్సిడి ఇస్తా

తేదీ: 9 జనవరి 2016, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి – మా ఊరు కార్యక్రమానికి హాజరు, ప్రదేశం:  ఆలంఖాన్ పల్లె, కడప

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • కడప నుండి హైదరాబాదు, బెంగుళూరు, అమరావతి నగరాలకు విమాన సర్వీసుల ఏర్పాటు
  • బుగ్గవంక సుందరీకరణ పూర్తిచేస్తాం
  • పట్టిసీమ నీటిని తెచ్చి రాయలసీమను సస్యస్యామలం చేయటానికి కృషి చేస్తున్నాం

తేదీ: 20 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో వరద ప్రాంతాల పర్యటన,  ప్రదేశం: రైల్వేకోడూరు పట్టణం, సమీప గ్రామాలు 

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • రైల్వేకోడూరులో కావాల్సినన్ని శీతల గిడ్డంగులు ఏర్పాటు
  • గుంజనేరుపైన కిలోమీటరుకు ఒకటి చొప్పున వంద చెక్ డ్యాముల ఏర్పాటు
  • గుంజనేరు – గాలేరు నగరి కాల్వల అనుసంధానం
  • గాలేరు – నగరి ప్రాజెక్టు పూర్తి చేస్తాం

తేదీ: 9 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో కడప జిల్లా పర్యటన, బహిరంగ సభ  ప్రదేశం: ముద్దనూరు

ఇచ్చిన హామీలు:

  • టూరిజం కేంద్రంగా గండికోట అభివృద్ది (పాత హామీ పునశ్చరణ)
  • 2016 నాటికి గండికోట జలాశయానికి సాగునీరు (పాత హామీకి కొత్త గడువు)
  • కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు 2016కు పూర్తి చేస్తాం(పాత హామీకి కొత్త గడువు)
  • కెసి కెనాల్ కింద సాగులో ఉన్న పంటలకు నీళ్ళు
  • సర్వారాయ సాగర్ నుండి కడప నగరానికి నీళ్ళు
  • రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం (పాత హామీ పునశ్చరణ)
  • ముద్దనూరులో తితిదే కళ్యాణమండపం, షాదీఖానా, కమ్యూనిటీ భవనాలు
  • ఉక్కు, సిమెంటు పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం (పాత హామీ పునశ్చరణ)

తేదీ: 17 ఆగష్టు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో ఇరిగేషన్ అధికారులతో 10 ని||ల సమీక్ష,  ప్రదేశం: కడప విమానాశ్రయం

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • హంద్రీనీవా ద్వారా రాయచోటికి నీరందేలా చూడాలి
  • కడపలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తాం
  • రాయలసీమ కోసమే పట్టిసీమ

తేదీ: 7 జూన్ 2015, సందర్భం: విమానాశ్రయ ప్రారంభోత్సవం, జన్మభూమి – మా ఊరు కార్యక్రమం ప్రదేశం: కడప, ఖాజీపేట

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • రెండేళ్లలో గాలేరు-నగరి పూర్తి
  • గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా
  • ఒంటిమిట్ట, తాళ్ళపాకలకు టూరిజం సర్క్యూట్లో  భాగం కల్పిస్తా
  • కడపలో హజ్ హౌస్ ఏర్పాటు చేస్తాం

తేదీ: 8 మే 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జలదీక్ష బహిరంగసభ  ప్రదేశం: కమలాపురం

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా జలాలు సీమకు తరలించి కరువు లేకుండా చేస్తా

తేదీ: 2 ఏప్రిల్ 2015, సందర్భం: కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనడం, ప్రదేశం: ఒంటిమిట్ట

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • 50 కోట్లతో ఒంటిమిట్ట కోదండరామాలయ అభివృద్ది
  • మరో తిరుమలలా ఒంటిమిట్టను తీర్చిదిద్దుతాం
  • 34 కోట్లతో శ్రీరామ ఎత్తిపోతల పథకం ఏర్పాటు (ఆరు నెలలలో పనుల పూర్తి)
  • ఒంటిమిట్ట, తాళ్ళపాకలకు టూరిజం సర్క్యూట్లో భాగం

తేదీ: 27 ఫిబ్రవరి 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ప్రదేశం: గండికోట జలాశయం

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • కాల్వ గట్లపై నిద్రించి అయినా 2015 జులై నాటికి గండికోటకు 35 టిఎంసిల నీరు నిల్వ చేస్తా
  • ఒంటిమిట్టను టూరిజం సర్క్యూట్లో భాగం చేస్తాం
  • కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ తెస్తా (విభజన చట్టంలో భాగంగా ఉన్నఅంశం)

తేదీ: 8 నవంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో జన్మభూమి- మా ఊరు గ్రామ సభ  ప్రదేశం: ఓబనపల్లె

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • ఏమీ లేవు

తేదీ: 4 సెప్టెంబరు 2015, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో రాజధాని ప్రకటన  ప్రదేశం: ఆం.ప్ర శాసనసభ, హైదరాబాద్

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు (విభజన చట్టంలోని హామీ)
  • సిమెంటు పరిశ్రమల ఏర్పాటు
  • పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు
  • కడప విమానాశ్రయం వాడుకలోకి తేవడం
  • ఫుడ్ పార్క్ ఏర్పాటు
  • ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • గార్మెంట్ క్లస్టర్ ఏర్పాటు
  • సౌర, పవన విద్యుతుత్పత్తి కేంద్రాల ఏర్పాటు

తేదీ: 7 ఏప్రిల్ 2014, సందర్భం: ప్రజాగర్జన సభ (ఎన్నికల ప్రచారం)  ప్రదేశం: పురపాలిక మైదానం, కడప

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • ఐటీ హబ్ గా కడప
  • కడపలో హైటెక్ సిటీ
  • కడప విమానాశ్రయ అభివృద్ది
  • కడపను స్మార్ట్ సిటీగా తయారుచేస్తా

తేదీ: 31 మార్చి 2014, సందర్భం: ఎన్నికల మేనిఫెస్టో  ప్రదేశం: హైదరాబాదు

ఇచ్చిన హామీలు/చెప్పిన మాటలు:

  • కడప, అనంతపురం జిల్లాలలో ఇనుప ఖనిజం ఆధారంగా ఉక్కు కర్మాగారాల నిర్మాణానికి కృషి
  • కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలలో గొర్రెల పెంపకం అభివృద్ది, మాంస ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహం
  • కడప నుండి అనంతపురం, చిత్తూరు, ఒంగోలులకు నాలుగు వరుసల రహదారుల ఏర్పాటు (పేజీ 39)

ఇదీ చదవండి!

రాయలసీమ

చరిత్రలో రాయలసీమ – భూమన్

తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: