హోమ్ » వార్తలు » ‘జీవో 69ని రద్దుచేయాల’

‘జీవో 69ని రద్దుచేయాల’

శ్రీశైలం డ్యామ్‌కనీస నీటిమట్టం విషయంలో ప్రభుత్వంస్పందించకపోతే ఉద్యమ బాట తప్పదని శాసనసభ్యులు, రైతు, ప్రజా సంఘాలనేతలు మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీమరైతు కోసరమని వారంతా ఆందోళన పథాన్ని ఎంచుకున్నారు.

కర్నూలు: రాయలసీమ హక్కుల సాధన కోసం వైకాపా శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం (ఈ నెల ఏడున)  శ్రీశైలం డ్యామ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లమల అడవిలోని శ్రీశైలం డ్యామ్‌పరిసర ప్రాంతాలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు చెందిన రైతన్నలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్షవిధానాలను వారు తూర్పారబట్టారు.

గురువారంఉదయం 10 గంటలకు సున్నిపెంట గెస్ట్‌హౌస్ నుంచి పాదయాత్రగా డ్యాంకు చేరుకున్నారు. అక్కడ ఎస్‌ఈ కార్యాలయాన్నిముట్టడించారు. ఈ సందర్భంగా కర్నూలు,వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలకు చెందిన శాసనసభ్యులు తమ నిరసన గళం వినిపించారు.

రాయలసీమ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలు తీరాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటిమట్టం ఉండితీరాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఇందులోఏమాత్రం తగ్గినా రాయలసీమ ఎడారిగామారక తప్పదని హెచ్చరించారు. సీమ ప్రజలహక్కు కోసం ముందుగా రైతులు ముందుకురావాలని పిలుపునిచ్చారు. రైతులు, ప్రజలుముందుకు వస్తే వారి కోసం పోరాడేందుకు తమ పార్టీ ముందుంటుందని భూమా నాగిరెడ్డి హామీఇచ్చారు. సీమ ప్రజల కోసం దివంగత వైఎస్ తలపెట్టిన సిద్దేశ్వర జలాశయాన్ని కూడా సాధించుకునేందుకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గుండ్రేవులజలాశయం కూడా రాయలసీమ ప్రజలకుఎంతో అవసరమని సూచించారు.

69 జీఓనువెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రిని నిలదీయాలని రాయలసీమలోని అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులకు పిలుపునిచ్చారు. కృష్ణా బోర్డు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి..సాగు, తాగు నీటి కోసం 65 గ్రామాలు, 6 లక్షలఎకరాలను వదులుకున్న కర్నూలు జిల్లాలోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు వివిధ రైతుసంఘాల నేతలు డిమాండ్ చేశారు. అతితక్కువ వర్షపాతం నమోదయ్యే రాయలసీమప్రాంతంలో రైతుల కష్టాలను గట్టేక్కించాలంటేకర్నూలులోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఆగస్టు 15న కర్నూలుకు వస్తున్నసీఎం చంద్రబాబును ఈ విషయంపై నిలదీస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు సమన్యాయం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేసీకెనాల్‌కు కేటాయించిన 10 టీఎంసీల తుంగభద్ర నీటిని అనంతపురం జిల్లాకు తరలించాలని, ప్రత్యామ్నాయంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్నారు. సిద్దేశ్వరం,పోలవరం, వెలుగొండ, గాలేరు నగరి, హంద్రీనీవా, గుండ్రేవుల ప్రాజెక్టులకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపి సత్వరమే ప్రాజెక్టు పనులనుచేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే రాయలసీమ నీటి వాటా కోసం రాష్ట్రాన్ని మూడుముక్కలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనివైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుడ్డారాజశేఖరరెడ్డి, ఆదినారాయణరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, ఐజయ్య, బుగ్గనరాజేంద్రనాథ్‌రెడ్డి, మణిగాంధీ, విశ్వేశ్వరరెడ్డి,చాంద్ బాష, జయరామ్, మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డిలతో పాటు బీజెపీ నేత నిమ్మకాయల సుధాకర్, రైతు సంఘం, రాయలసీమ ఐక్య కార్యాచరణసమితి నాయకులు బొజ్జా దశరథరామిరెడ్డి,ఎస్‌ఆర్‌బీసీ పరిరక్షణ సమితి నాయకులుఎరువ రామచంద్రారెడ్డి, కుందూ పోరాటసమితి కన్వీనర్ వేణుగోపాల్‌రెడ్డి, కేసీ కెనాల్‌సాధన కమిటీ అధ్యక్షుడు కట్టమంచి జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని నీలంసాగర్ డ్యాంఎస్‌ఈ శ్రీనివాసరావుకు అందజేశారు.

ఇదీ చదవండి!

చంద్రన్నకు

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు… అన్నా! చంద్రన్నా!! మీరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.