హోమ్ » వార్తలు » ‘ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాల’

‘ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాల’

రాయలసీమలో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలనే నినాదంతో పోరాటాన్ని ఉద్ధృతం చేసి, అన్నివర్గాల మద్దతుతో ముందడుగు వేస్తామని డాక్టరు పద్మలత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీరోడ్డులోని బాలాజీ వైద్యాలయంలో మంగళవారం రాయలసీమ రాజధాని సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పద్మలత మాట్లాడుతూ.. ఉద్యమ్యాన్ని ముందుకు నడిపించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, వ్యాపార, ప్రజా సంఘాల మద్దతు తీసుకుని ముందడుగు వేస్తామని వివరించారు.

గతంలో కర్నూలులో రాష్ట్ర రాజధాని ఉండేది – ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలించారన్నారు. తెలుగుజాతిని ముక్కలు చేసిన తర్వాత ఆంధ్రపదేశ్‌కు రాజధాని సీమలో ఏర్పాటు చేసేలా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

నిధులు- అభివృద్ధితో పాటు రాజధాని మన ప్రాంతంలో నిర్మించేలా పోరాటం చేస్తున్నాం. ఇందులో ప్రతిఒక్కరు స్పందించి స్వచ్ఛందంగా ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రషీద్‌ఖాన్, వెంకటేశ్వర్‌రెడ్డి, ఖలందర్, భాస్కర్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఈ అనివార్యతను పట్టించుకోకుండా రాష్ట్రప్రభుత్వం ఒంటెద్దు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: