“రండి, వచ్చి చూడండి… తర్వాత మాట్లాడదాం” : కడప పర్యటన – 2

గండికోట, బ్రహ్మం సాగర్, తాళ్ళపాక, పెద్ద దర్గా … అని చెప్పేశాక అమర్ అన్నాడు ‘నేచర్ టూర్ లాగా ప్లాన్ చేద్దాం, గుళ్ళూ గోపురాలూ కాకుండా…’ అని.

వెంటనే ఒక రూట్ మ్యాపు తయారుచేశాం. దానిని జట్టు సభ్యులకు పంపించాం.

‘కడపలో ఏముంది?’ అన్న ఆనంద్ ప్రశ్నను చాలా మంది మళ్ళీ మళ్ళీ అడిగారు. “రండి, వచ్చి చూడండి… తర్వాత మాట్లాడదాం” అని సరిపుచ్చాను.

తేదీల ఖరారులో తఖరారు లేకుండా చెయ్యాలని జూలైలో మూడు తేదీలను ఎంపిక చేసి వోటింగ్ ద్వారా ఒక తేదీని ఎన్నుకోమని ఈ-మెయిలు పంపితే ఎక్కువ మంది జూలై 23 సుముఖత వ్యక్తం చేసారు.

చదవండి :  తెదేపా నాయకులకు కడప జిల్లా ప్రజల ప్రశ్నలు

బడ్జెట్ నిర్వహణను నేను తీసుకొని అకౌంటింగ్, వసూలు భాద్యతను శ్వేతకు, టికెట్ రిజర్వేషన్ ను అమర్ కు అప్పగించాం.

‘ఒక్క దినేష్,బెనిటా మాత్రం స్పందించటం లేదు. మిగతా అందరూ డబ్బులిచ్చారు.’ అని శ్వేత లెక్క చెప్పింది ఒక రోజు.

దినేష్ తో మాట్లాడితే వ్యక్తిగత కారణాలు చెప్పాడు. బెనీటా మాత్రం రాలేనని తెగేసి చెప్పింది. మిగతా అందరూ డబ్బులిచ్చినప్పటికి ఎక్కడ డుమ్మా కొడతారో అన్న చిన్న సందేహం…

ఔటింగ్ కు సరిగ్గా వారం రోజుల ముందర ‘సంవత్సర మదింపు’ (Annual Appraisal) ఫలితాలు వచ్చేశాయ్. ఈ ఫలితాలు కొందరికి పదోన్నతిని, జీత భత్యాల పెంపుదలను తీసుకొస్తే మరికొందరికి కోపాన్ని తీసుకోస్తుంటాయి. ఈ ప్రభావం ఔటింగ్ పైన పడుతుందన్న సంశయమూ కలిగింది.

చదవండి :  ధవళేశ్వరం బుడుగును నేను... (ముళ్లపూడి వెంకట రమణ బాల్యం)

ఇలా ఉండగా ఒక సోమవారం (జూలై 18న) పొద్దున్నే ప్రాజక్టు మేనేజరు వచ్చి ‘కాన్ఫరెన్స్ రూముకు వెళదాం రా.. రెండు నిముషాలు మాట్లాడుకుందాం’ అన్నాడు.

చాలా సీరియస్ గా … చివరి నిమిషంలో వచ్చిన పని కారణంగా ఔటింగ్ కు రాలేనని విచారం వ్యక్తం చేస్తూ చెప్పేశాడు. అలా మొదలైన విచారానికి కొనసాగింపుగా శరణ్య, శిల్ప లు సైతం ఎర్ర జెండా ఊపేశారు. విషయాన్ని జట్టు సభ్యుల చెవిన వేశాను. వారిని ఒప్పించటానికి అందరూ ప్రయత్నించి చర్చలు విఫలమైనట్లు ప్రకటించారు. చివరి పట్టీ తయారు చేసి 9 మందిని తుది జాబితాకు కుదించింది శ్వేత.

చదవండి :  విశిష్టమైన అటవీ సంపద ''రాయలసీమ'' కే సొంతం!

(సశేషం)

‘ఏముండయన్నా కడపలో’? : కడప పర్యటన – 1

ఇదీ చదవండి!

ధవళేశ్వరం బుడుగును నేను… (ముళ్లపూడి వెంకట రమణ బాల్యం)

76 సంవత్సరాల ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: