మనోళ్ళు జిమ్నాస్టిక్స్‌లో పతకాల పంట పండించారు

వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థుల ఘనత

కడప : కాకినాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగిన రాష్ట్రస్థాయి 60వ ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ పోటీల్లో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు  23 పతకాలను సొంతం చేసుకుని కడప జిల్లా సత్తా చాటారు. మొత్తం  8 బంగారు, 11 రజతం, 4 కాంస్య పతకాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు.  అండర్-14 బాలికల విభాగంలో కడపకు టీం ఛాంపియన్‌షిప్ వచ్చింది. అండర్-17 బాలుర విభాగంలో కడప జట్టు మూడవస్థానాన్ని పొందింంది.

చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?

విజయవాడలో నవంబరు 26 నుంచి 30వ తేదీ వరకు జరిగిన జూనియర్ నేషనల్స్‌ అథ్లెటిక్స్‌లో కూడా వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు రాణించారు. ఈ పోటీలలో పాఠశాల విద్యార్థి వివేకానంద త్రయాథలిన్‌లో బంగారు, 100 మీటర్ల పరుగుపోటీలో రజత పతకం సాధించాడు. రాఘవేంద్రరెడ్డి లాంగ్‌జంప్‌లో కాంస్య పతకం అందుకున్నాడు.

పతకాలను సాధించిన విద్యార్థులను వైఎస్సార్ క్రీడాపాఠశాల అధికారులు మంగళవారం పాఠశాలలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరచి పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాఠశాలకు చెందిన 16 మంది జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం విశేషమని చెప్పారు. కోల్‌కతాలో జరగబోయే జాతీయస్థాయి పోటీల్లో కూడా విద్యార్థులు సత్తా చాటాలని ఆకాక్షించారు.

చదవండి :  కడప జిల్లాలో 15 చిరుతపులులు...

ఇదీ చదవండి!

kadapa district map

ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: