నేడు ఒంటిమిట్ట సీతారాముల పెళ్లి ఉత్సవం

ఒంటిమిట్ట: కౌసల్య దశరథమహారాజు తనయుడు శ్రీరామచంద్రమూర్తికి జనక మహారాజు తనయ సీతామహాదేవితో స్వస్తిశ్రీ శ్రీనందననామ సంవత్సర ఉత్తరాయణే, వసంత రతువే, చైత్రమాసే చతుర్ధశి గురువారం సరియగు 5వ తేదీ రాత్రి 10 గంటలకు కల్యాణం జరుగులాగున దేవదేవులు నిర్ణయించారు. అత్యంత వైభవంగా, కనుల పండువగా నిర్వహించనున్న శ్రీరామచంద్రమూర్తి కల్యాణోత్సవానికి వీక్షించి, పులకించ మనవి.

ఒంటిమిట్ట కోడండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు (బేస్త(గురు)వారం) భక్తజన సందోహం మధ్య స్వామి కల్యాణాన్ని నిర్వహించడానికి జిల్లా అధికారులు, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు.

చదవండి :  గవర్నర్ చేతులమీదుగా కోదండరామ కళ్యాణం

 

స్వామి ఆలయం గాలిగోపురం (తూర్పు ద్వారం) ముందుభాగంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. పగటి ఉత్సవాల్లో భాగంగా శివధనుర్భాలంకారంలో, రాత్రి గజవాహనంపై స్వామివారు పురవీధుల్లో ఊరేగనున్నారు.

 

ముత్యాల తలంబ్రాలు

అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న స్వామి కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలను దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య తీసుకురానున్నారు.

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట రథోత్సవం

కనుల పండువగా కోదండరాముని రథోత్సవం

ఒంటిమిట్ట : కోదండరాముని రథోత్సవం శుక్రవారం కన్నుల పండువగా సాగింది. సీతాలక్ష్మణ సమేతుడై రథంపై ఊరేగి వచ్చిన  కోదండరాముడు పుర …

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: