పరిశ్రమల స్థాపనకు 44 దరఖాస్తులు

కడప : జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల పరిశ్రమల స్థానకు 44 దరఖాస్తులు వచ్చాయని.. అందులో 33 దరఖాస్తులకు కమిటీ అనుమతిని ఇచ్చిందని మంగళవారం తన కార్యాలయంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ రమణ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఎనిమిది దరఖాస్తులకు సంబంధించి అదనపు సమాచారం కోరాలని సూచించారు. మరో మూడు దరఖాస్తులపై అధికారులు చర్చించి నిర్ణయం తీసుకుంటారన్నారు.

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ వెంకటరమణ అన్నారు. కొప్పర్తి పారిశ్రామికవాడలో పరిశ్రమల స్థానకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

చదవండి :  కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్

సమావేశంలో ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ రమణారెడ్డి, పరిశ్రమలశాఖ జీఎం గోపాల్ ఇతర అధికారులూ పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

తప్పెట ప్రభాకర్‌రావు

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ …. తప్పెట ప్రభాకర్‌రావు ఐఏఎస్‌

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది? కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: