పిలిచిన పలికే దేవుడు – కోవరంగుట్టపల్లె గరుత్మంతుడు

సింహాద్రిపురం : కోరి కొలిచేవారికి కొంగుబంగారంగా, పిలిచిన  పలికే  దేవుడు,గరుత్మంతుడుఅనే విశ్వాసం వందలాది మంది భక్తుల్లో వేళ్లూనుకుంది. సింహాద్రపురం మండలం కోవరంగుట్టపల్లె గ్రామ శివార్ల భక్తుల సందడితో గరుత్మంతుడి ఆలయం అలరారుతోంది. పూర్వీకుల సందేసానుసారంగా కోవరంగుట్టపల్లె గ్రామ శివార్లలో పురాతనకాలంనాటి ఓ సమాధి ఉంది. చాలా కాలం నుంచి ఈ సమాధి పట్ల ఎవ్వరూ శ్రద్ధచూలేదు. అయితే ప్రతి ఏటా శ్రీరామనవమి పండుగరోజున ప్రత్యేక పూజలు చేస్తారు. కొన్నాళ్ల తర్వాత భాస్కర్‌ అనే భక్తుడు గరుత్మంతుడు చరిత్ర తెలుసుకుని అక్కడ గుడి కట్టించారు. ఈ ఆలయంలో నిత్యం జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కీళ్లు, ఒళ్లు, మోకాళ్లు నొప్పులకు తైలం రాస్తారు. ఇలాంటి బాధితులు చాల మంది తమ జబ్బులను నయం చేసుకున్నారు.

చదవండి :  గుండాల కోన

గరుత్మంతుడి విశిష్టత.. శ్రీమన్నారాయణుడి ప్రధమ వాహనం కశ్యప మహర్షికి వినతకు జన్మించిన వాడు గరుత్మంతుడు . గరత్తులు అనగా రెక్కలు. కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. సమస్త చరాచర భూతకోటిని పాలించే పాలించే శ్రీమన్నారాయణుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి, ఎప్పుడు కావాలంటే అప్పుడు పరసరాలు ఎంత భయంకరంగా ఉన్నా , పరిస్థితులు ఎలా ఉన్నా లెక్కచేయకుండా వాయు వేగంగా క్షణకాలంలో తీసుకుపోగల సత్తా ఒక్క గరుత్మంతుడికే సొంతం అమృతం తీసుకురావడం కోసం అమిత సాహసోపేతమైన పోరాటాలు చేసి తానుగా తనకంటూ చెప్పుకోతగ్గ చరిత్ర ఉందని పురణాలు చెబుతున్నాయి. దేవతలు, రాక్షసులు, పాలకడలిని, చిలకడానికి మందిర పర్వతాన్ని ఎగువవేసుకుని వచ్చి సముద్ర మధ్యలో దింపిన బలశాలి గరుత్మంతుడే. శ్రీ వెంకటేశ్వ రస్వామికి ఎన్నో వాహనంలో ఊరేగింపు గరుడోత్సవానికి తిరుమల కొండ విపరీతమైన భక్తజనంతో కన్నుల పండువగా ఉండటమే గరత్ముంతుడి ప్రత్యేకత. భూమి మీద ఏ ఆపద వచ్చినను స్వామి గరుత్మంతా నారాయణుడిని వాయు వేగంతో ఆగమేఘాల మీద వచ్చి మమ్మల్ని కాపాడుకోవయ్యా అంటు ప్రజలు వేడుకుంటారు. ఇందుకు ఉదాహరణమే భద్రాచల రామదాసు తన ఆపద సమయంలో గరుడ గమన రారాలను నీ కరుణ మేలుకోరా అని ప్రార్థించారు. శ్రీమన్నారాయణుడి వాహనమే కదా ఏనాడూ చిన్నచూపు చూడలేదు. ఇంతటి మహానుభావుడు కనుకనే ఆయన్ను వైష్ణవులు దేవుడిగా కీర్తించారు. ఆ మహాత్ముడి ఘన కీర్తిని రోమాంచికమైన ఆయన చరిత్రను గరుడ పురాణంలో తెలియచేసినట్లు చరిత్ర చెబుతోంది. ఇంతటి మహిమ ఉన్న గరుత్మంతుడి వద్దకు చాలా మంది భక్కులు వచ్చి తైలంతో ఒళ్లు, కీళ్లు, మోకాళ్ల నొప్పులు నయం చేసుకుంటుంటారు. ఈ తైలం బయట ప్రదేశాలకు వచ్చి మర్ధన చేస్తే వికటిస్తుందనే భావన కూడా ఉంది.

చదవండి :  కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: