తెదేపా నాయకులకు కడప జిల్లా ప్రజల ప్రశ్నలు

జిల్లాలో ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులకు జిల్లా ప్రజానీకం తరపున కొన్ని ప్రశ్నలు.

1.పోతిరెడ్డిపాడు  నీళ్లన్నీ కడపకు తరలించుకుపోతున్నారంటూ తెదేపా నాయకులు ఆరోపణలు చేసిన విషయం వాస్తవం కాదా?

2.ఆ రోజు తెదేపా తరపున కడప పై అక్కసు వెళ్ళగక్కిన (ఉదా: రేవంత్ రెడ్డి, దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, ఎర్రన్నాయుడు…) నేతలే ఇవాళ జిల్లాలో ప్రచారం చేయటం విడ్డూరం కాదా?

3.ఆ రోజు కడప జిల్లా అభివృద్ధిని దోపిడీతో పోల్చిన ఈ తెదేపా నాయకులు జిల్లాలో వోటు కోసం రావటం ఎంతవరకు సబబు?

చదవండి :  ఒంటిమిట్టలో కృష్ణంరాజు

 4.ఆ రోజు తెదేపా తరపున కడప పై అక్కసు వెళ్ళగక్కిన ఈ నాయకులు నేడు కడప జిల్లాలో ఆగిన  అభివృద్దిని గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదెందుకు?

5.కడప జిల్లా అభివృద్దిపై మీ వైఖరేంటి?

6.జగన్ తప్పుల పైన లేదా వ్యక్తిత్వం పైన నిర్ణయం తీసుకోగల విచక్షణ ఈ జిల్లా ప్రజలకు ఉంది. జగన్ కాకుండా కడప పై మీ ప్రణాలికలేంటి?

7.కే.సి. కెనాల్ ఆయకట్టును గురించి లేదా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పైన మీ తెదేపా వైఖరి ఏమిటి?

చదవండి :  కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

8.మైసూరా రెడ్డికి వోటు వేస్తె మీరు ఈ జిల్లా కోసం ఏం చేస్తారు?

కడప జిల్లాలో ఆయా నేతలు పర్యటించటం తప్పు కాదు. అదే సందర్భంలో గతాన్ని జిల్లా ప్రజలమైన మేము అంత వీజీగా మర్చిపోము.

– కడప జిల్లా ప్రజలు

ఇదీ చదవండి!

రాయలసీమపై టీడీపీ

రాయలసీమపై టీడీపీ కక్ష తీర్చుకుంటోంది : బిజెపి

కడప : రాయలసీమ కోసం తెలుగుదేశం నేతలు దొంగ దీక్షలు, యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్థన్‌ …

6 వ్యాఖ్యలు

  1. its superb questions to tdp……………….

  2. please keep the value of website banner. don’t support corrupted people.

  3. 1983 nunchi valla mama daggara untu chandra babu entha corruption chesado, 1973 lo eenadu paper petti ippati varuku ramoji entha earn chesado…, jagan 5 yrs lo vallani minchi corruption chasadu. corruption lo kuda moral values chudali. ee jagan cm aithe , inka mana state 1st place chuda vacchu from last place.

  4. Rayalaseema is very bachward region in AP. Inform to Prime Minister of India,Sree Mod about the sistuation in rayalaseema region. Otherwse we will loose everything.Onbehalf of United Forum of Rayalaseem inform to PMi

Leave a Reply

Your email address will not be published.

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: